ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకే ఒక్కడు .. అల్లు అర్జున్ రేర్ ఫీట్ , ఏ హీరోకి కూడా లేదు
ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర కానీ ప్రపంచ సినిమా దగ్గర కానీ మన తెలుగు సినిమాల రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇందుకు మూల కారణం డెఫినెట్ గా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పి తీరాలి. కాగా తాను వేసిన పాన్ ఇండియా అండ్ సీక్వెల్స్ బాటలోనే పలు సినిమాలు వచ్చి ఇపుడు సత్తా చాటుతున్నాయి.
అయితే రాజమౌళి విషయంలో టాలీవుడ్ లో ఒక టాక్ ఉంది. రాజమౌళి వల్లే కొందరు హీరోలు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుంటారు. అక్కడ నుంచి భారీ వసూళ్లు అండ్ మార్కెట్ ని అందుకుంటారు. కానీ వీటి అన్నిటికీ అతీతుడు ఒక్కడు ఉన్నాడు. అతడే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అసలు రాజమౌళి బ్రాండ్ అనేదే లేకుండా ఇపుడు టోటల్ ఇండియన్ సినిమాని రూల్ చేసే స్థాయికి వెళ్ళాడు.

కాగా ఇపుడు అల్లు అర్జున్ అనే పేరు రాజమోళి కంటే పెద్దది అని చెప్పడానికి ఇపుడు పుష్ప 2 కి వస్తున్నా ఇండియన్ వసూళ్లే సాక్ష్యం. ఇలా అల్లు అర్జున్ రేంజ్ ఏంటో ఆల్రెడీ మొదటి రోజు ఏకంగా 290 కోట్ల ప్లస్ గ్రాస్ తోనే ప్రూవ్ అయ్యింది. ఇపుడు ఈ సినిమా టికెట్ బుకింగ్స్ లోనే బన్నీ మరో బిగ్గెస్ట్ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.
అది కూడా ఇండియన్ సినిమా దగ్గర ఎన్ని సినీ ఇండస్ట్రీస్ ఉన్నాయి? ఎంతమంది బిగ్ స్టార్స్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ నుంచి ఉన్నారు? ఇలా ఏ భాషలో అయినా టోటల్ ఇండియన్ సినిమా చరిత్రలో బన్నీ సెట్ చేసిన లేటెస్ట్ రికార్డు ఏ ఒక్క హీరో కూడా సొంతం చేసుకోలేకపోయాడు. ఇప్పటి రోజుల్లో సినిమా చూడాలి అంటే బుక్ మై షో యాప్ లో సింపుల్ గా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. కాగా ఇదే యాప్ లో పుష్ప 2 హిస్టరీ క్రియేట్ చేసింది.

అందులో ఒక్క గంటలో లక్ష టికెట్స్ తెగడం అనేది గగనం. ఇది వరకు హైయెస్ట్ గా ఇండియన్ సినిమా దగ్గర ప్రభాస్ కల్కి 2898 ఎడి సినిమా ఒక్క గంటలో 92 వేలకి పైగా టికెట్స్ అమ్ముడుపోయి బిగ్గెస్ట్ రికార్డు సెట్ చేసింది. ఇది పీక్ లో కేవలం ఒకే ఒక్క రోజులో జరిగింది. కానీ దీనిని పుష్ప 2 లక్ష టికెట్స్ తో బ్రేక్ చేసి సంచలనం సెట్ చేయడం ఒకెత్తు అయితే ఇపుడు ఏకంగా మూడు రోజులు వరుసగా ఈ ఫీట్ ని సెట్ చేసింది.
దీనితో ఒక్క రోజే అనుకుంటే ఏకంగా ఐకాన్ స్టార్ మూడు రోజులు వరుసగా సెట్ చేసి ఇండియన్ సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ రికార్డు సెట్ చేసాడు. దీనితో పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ క్రేజ్ ఏ లెవెల్లో ఉందో ఆలోచిస్తే మెంటల్ వచ్చేస్తుంది అని చెప్పి తీరాలి.


Click it and Unblock the Notifications











