Don't Miss!
- Finance
LIC: అదానీ కంపెనీల్లో పెట్టుబడిపై ఎల్ఐసీ క్లారిటీ.. మెుత్తం ఎక్స్పోజర్ రూ.56,142 కోట్లు..!!
- Sports
INDvsNZ : మూడో టీ20కి మంచి పిచ్ కావాలి.. టాపార్డర్‌కు అదొక్కటే దారి!
- News
పాకిస్తాన్లో నరమేథం: మసీదులో ప్రార్థనల వేళ: అంతకంతకూ మృతుల సంఖ్య..!!
- Lifestyle
జుట్టు ఎక్కువగా రాలుతుందా? అయితే కరివేపాకును ఇలా వాడితే మీ జుట్టు ఒత్తుగా, కాంతివంతంగా పెరుగుతుంది
- Technology
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- Automobiles
ప్యూర్ EV లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ 'ecoDryft': ధర రూ. 99,999 మాత్రమే
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Allu Arha: క్యూట్ గా అల్లు అర్హ డబ్బింగ్ ఫొటో.. నెట్టింట్లో వైరల్
పుష్ప సినిమా ద్వారా యావత్ ప్రపంచవ్యాప్తంగా యమ పాపులర్ అయ్యాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఆయన కుమార్తే అల్లు అర్హ అంటే తెలియని తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఉండరు. సినీ ఇండస్ట్రీలో స్టార్ వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమే. కొందరు హీరోలు, హీరోయిన్స్ గా చిత్రసీమలో అడుగుపెడితే మరికొందరు మాత్రం తమ చిన్నతనంలోనే అలరిస్తారు. అలాంటి వారిలో అల్లు అర్హ ఒకరు. సోషల్ మీడియాలో తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న అల్లు అర్హ తాజాగా ఓ సినిమా కోసం డబ్బింగ్ చెబుతోంది. దానికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

క్యూట్ నెస్ తో..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ పేరుతోనే ఫేమస్ అయింది. ఆ తర్వాత ఎదుగుతోన్న క్రమంలోనే ఈ చిన్నారి మరింత పాపులర్ అయింది. ముఖ్యంగా తన ముద్దు ముద్దు మాటలకు.. పాటలకు.. అల్లరికి ఎంతో మంది ఫిదా అయిపోయారు. అందుకే సోషల్ మీడియాలో అర్హకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. క్యూట్‌నెస్‌తో చిన్న వయసులోనే తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయిపోయింది బన్నీ కూతురు అల్లు అర్హ.

హైలెట్ గా అర్హ ఎంట్రీ..
ఇక అల్లు అర్హ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ లేడీ ఒరియెంటెండ్ సినిమా శాకుంతలంలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ను ఇటీవల విడుదల కూడా చేశారు. అందులో సింహంపై కూర్చుని అల్లు అర్హ ఇచ్చిన ఎంట్రీ అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఆ ట్రైలర్ కే అల్లు అర్హ ఎంట్రీ హైలెట్ గా నిలిచింది.

స్టార్ కిడ్ గా గ్రాండ్ గా..
కాళీదాసు రచన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం కోసం అల్లు అర్హ డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది. ఇటీవలే 6వ ఏటలోకి అడుగు పెట్టిన అల్లు అర్హ స్టూడియోలో డబ్బింగ్ చెప్పిన ఫొటోను తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు అల్లు అర్జున్. ఈ పిక్ షేర్ చేస్తూ దానిపై హార్ట్ సింబల్ వేశాడు. ఇక అల్లు అర్హ ఇప్పటికే స్టైలిష్ స్టార్ కిడ్ గా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అలాగే తండ్రి అల్లు అర్జున్ లాగే అల్లు అర్హ అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆకర్షించనుంది.

చిట్టి భరతుడిగా..
శాకుంతలం సినిమాలో అల్లు అర్హ చిట్టి భరతుడు పాత్రలో కనిపించనుంది. సమంత ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు, నీలిమ గుణ నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన శాకుంతలం సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా 2డీ, 3డీ వెర్షన్ లలో విడుదల కానుంది. అయితే శాకుంతలం సినిమా వీఎఫ్ఎక్స్ కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే.

సన్నాఫ్ సత్యమూర్తి తరహాలో..
ఇక అల్లు అర్హ విషయానికొస్తే శాకుంతలం సినిమా మాత్రమే కాకుండా మరొక చిత్రంలో కూడా నటించనుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో ఒక స్పెషల్ రోల్ చేయనుందట అల్లు అర్హ. ఈ సినిమాలో అర్హ కనిపించేది తక్కువ స్క్రీన్ టైమ్ అయినా ఎంతో క్యూట్ గా ఉంటుందని టాక్. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉన్న చిన్నారి పాత్ర తరహాలో అల్లు అర్హ రోల్ ఉంటుందని భోగట్టా.