పీక కోసేస్తానంటున్న అల్లు అర్జున్ కూతురు.. ఎంత క్యూట్‌గా చెబుతుందో చూడండి
Recommended Video
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. తన ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటాడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. షూటింగ్ లేని సమయంలో ఇంటిలోనే ఎక్కువ గడుపుతుంటాడు. ఈ మేరకు అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక, తన పిల్లల విషయంలో బన్నీ ఎంతో సరదాగా ఉంటాడు. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే తన పిల్లలతో గడుపుతున్న సమయంలో తీసిన పిక్స్, వీడియోలను అతడూ తరచూ షేర్ చేస్తూ ఉంటాడు. తాజాగా అలాంటిదే మరో వీడియో బయటకు వచ్చింది.

అల్లు అర్హ చాలా ఫేమస్
అల్లు అర్జున్ కూతురి పేరు అర్హ. ఈ పేరు వెనుక పెద్ద కథే ఉంది. అర్జున్‌లోని మొదటి రెండు అక్షరాలు (ఇంగ్లీష్‌లో).. స్నేహలోని చివరి రెండు అక్షరాలు కలిపి ఈ పేరు పెట్టారు. దీంతో చిన్నప్పుడే ఈ పాప చాలా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత ఎన్నో పిక్స్, వీడియోలతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. దీంతో అర్హ గురించి అందరికీ తెలిసిపోయింది. ఇక, బన్నీనో.. ఆయన సతీమణో పోస్టులు చేయడం వల్ల చిన్న వయసులోనే అందరికీ సుపరిచితురాలు అయింది.
నాన్న చూసిన అబ్బాయిని చేసుకోను
గతంలో అల్లు అర్జున్ ఓ వీడియోను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అందులో తన కూతురు అర్హతో ‘నాన్న చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను' అని చెప్పించే ప్రయత్నం చేయగా.. ఈ చిన్నారి మాత్రం ‘చేసుకోను' అని సమాధానం చెప్పి షాకిచ్చింది. ఈ వీడియోలో ఎంత వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనిపై బన్నీ అభిమానులతో పాటు చాలా మంది సినీ సెలెబ్రిటీలు స్పందించారు.

ఇప్పుడు పీక కోసేస్తా అంటోంది
తాజాగా బన్నీ తన కూతురితో మోహన్ బాబు చెప్పిన ఫసక్ డైలాగ్ చెప్పించాడు. ‘ఓన్లీ వన్స్ ఫసక్' అని అనమంటే.. తండ్రి చెప్పినట్లే చెప్పింది. అంతేకాదు, తన చేతిలో ఉన్న దువ్వెతో అల్లు అర్జున్ గొంతును కోస్తున్నట్లు చూపించింది. దీంతో ఇద్దరూ నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీన్ని చాలా మంది షేర్లు చేస్తుండడంతో కొద్దిసమయంలోనే వైరల్ అయిపోయింది.

ప్రస్తుతం చేస్తున్న సినిమా
‘జులాయి', ‘సన్నాఫ్ సత్యమూర్తి' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.


Click it and Unblock the Notifications











