‘అల్లు అర్జున్‌ను ఆ డైరెక్టర్ చీట్ చేశాడా? అరవింద్ కోసం రజనీకాంత్ సినిమాను వదిలేశా’

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన కథలతో బ్లాక్ బస్టర్ సినిమాలకు రచయితగా పనిచేసిన రైటర్లలో చిన్నికృష్ణ ఒకరు. ఇంద్ర, నరసింహ నాయుడు, సీమ సింహం, బద్రీనాథ్, జీనియస్ చిత్రాలకు కథ రచయితగా పనిచేయడమే కాకుండా దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకొనే పని చేశారు. అయితే కొద్దికాలంగా సినిమా రంగంలో అడపాదడపా సినిమాలు చేస్తున్న ఆయన ప్రముఖ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి.. అల్లు అర్జున్ హీరోగా పరిచయం కావడం వెనుక తన ఘనతను వెల్లడించారు. ఆయన చెప్పిన ఆసక్తికరమైన విషయాల్లోకి వెళితే..

చిన్న కృష్ణ కథ రాస్తే సినిమా హిట్ అనే నమ్మకం 90 దశకంలో ఉండేది. ఆయన కథ అందించిన చిత్రాలు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. అయితే కొత్తతరం వేడివాడి ముందుకు రావడంలో సక్సెస్ రేసులో వెనుకబడినా గానీ.. చిన్నికృష్ణ బ్రాండ్‌ ఏ మాత్రం చెక్కుచెదర్లేదు. అలాంటి టాప్ రైటర్ మళ్లీ తన సినిమాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు రెడీ అవుతూ తన అనుభవాలను పంచుకొన్నారు.

Allu Arjun debut movie news

ఓ రోజు ఉదయమే నాకు అశ్వినీదత్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అల్లు అరవింద్ గారి అబ్బాయి అల్లు అర్జున్‌ను హీరోగా పరిచయం చేయాలనుకొంటున్నాం. ఈ సినిమా గురించి మాట్లాడానికి గెట్ గెదర్ ఏర్పాటు చేసి విందుకు ఆహ్వానించారు. తేజ దర్శకత్వంలో ఈ సినిమాను ప్లాన్ చేశారు. అంతా ఒకే అనుకొన్న సమయంలో ఓ రోజు నితిన్‌ను హీరోగా చేస్తూ తేజ దర్శకత్వంలో సినిమా గురించిన వార్త పేపర్లో వచ్చింది. దాంతో నేను షాక్ తిన్నాను అని రచయిత చిన్నికృష్ణ తెలిపారు.

అల్లు అర్జున్ సినిమాకు కాకుండా నితిన్ సినిమాకు తేజ దర్శకత్వం వహించే మార్పు గురించి అందరికి తెలిసిందే. ఇందులో సీక్రసీ ఏమీ లేదు. నితిన్ ప్రముఖ డిస్టిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కొడుకు కావడం.. నితిన్ కూడా టాలెంట్ ఉన్న వాడిని ఆ తర్వాత నిరూపించుకొన్నారు. అయితే అల్లు అర్జున్ సినిమా ఆగిపోవడం ఏమిటనే అందరూ చర్చించుకొన్నారు అని ఆయన చెప్పారు.

మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా పరిచయమయ్యే హీరో, అలాగే దేశంలోనే టాప్ నిర్మాత అల్లు అరవింద్ ఇంటి నుంచి హీరోగా పరిచయమయ్యే సినిమా ఆగిపోవడం ఓ సెన్సేషన్ వార్తగా మారింది. అట్లాంటి సమయంలో మెగా ఫ్యామిలీని అభిమానించే వారు, వారి కుటుంబంతోపాటు నేను చాలా హర్ట్ అయ్యాను. ఆ సమయంలో రాఘవేంద్రరావు గారు తన వందో సినిమా చేయమని నన్ను అడిగారు. దాంతో రజనీకాంత్ సినిమాకు కథ రాస్తున్న నేను.. దానిని ఆపివేసి.. ఆ స్క్రిప్టును మూసివేసి గంగోత్రి సినిమా కథపై కూర్చొన్నాను అని చిన్నకృష్ణ చెప్పారు.

అల్లు అర్జున్‌కు ప్రామిస్ చేశా.. అరవింద్ గారికి ఫోన్ చేసి.. ఈ రోజు నుంచి 365 రోజుల లోపల మీ అబ్బాయి హీరోగా సినిమా రిలీజ్ అవుతుందని ఛాలెంజ్ చేశాను. గంగోత్రి సినిమా కథ రాసి.. సినిమా తీసి రిలీజ్ చేస్తే.. 175 రోజులు ఆడింది. గోదావరి జిల్లాలో ఇంద్ర రికార్డును కూడా క్రాస్ చేసింది. అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యే సినిమా వెనుక ఇలాంటి కథ నడిచింది అని చిన్నకృష్ణ తన అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

More from Filmibeat

Read more about: allu arjun teja chinni krishna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X