కొత్త కాపురం పెట్టనున్న బన్నీ.. బ్లెస్సింగ్ అంటూ షేర్ చేసిన స్టైలీష్ స్టార్
అల్లు అర్జున్ టాలీవుడ్ స్టైలీష్ స్టార్ గా తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. అయితే చివరగా వచ్చిన నాపేరుసూర్య సినిమా బెడిసి కొట్టడంతో చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఆ గ్యాప్ ను పూరించాలని వరుసగా ప్రాజెక్ట్స్ను ఓకే చేశాడు.
మాటల మాంత్రికుడి త్రివిక్రమ్ దర్శకత్వంలో.. ఇప్పటికే రెండు సూపర్ హిట్ చిత్రాలను అభిమానులకు అందించిన బన్నీ.. తాజాగా హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అయ్యాడు. అల వైకుంఠపురములో అంటూ రిలీజ్ చేసిన టీజర్ కు భారీ స్పందన రాగా.. తాజాగా రిలీజ్ చేసిన సామజవరగమన పాట అయితే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్విటర్లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఇప్పటికే పది మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ పాట యూత్ ను ఆకట్టుకుంటోంది.

అయితే అల్లు అర్జున్ ఇంత వరకు అల్లు అరవింద్ తోనే కలిసి ఉన్నాడన్నసంగతి తెలిసిందే. అయితే బన్నీ త్వరలోనే కొత్తకాపురం పెట్టనున్నాడు. ఈ మేరకు కొత్త ఇళ్లును నిర్మించే పనిలో పడ్డాడు. రీసెంట్ గా సొంత ఆపీస్ ను ఓపెన్ చేసిన బన్నీ.. ఈ కొత్త ఇంటికి పునాదిని కూడా వేశాడు.
తాను కొత్త ఇంటిని కట్టుకుంటున్నానని, దాని పేరు బ్లెస్సింగ్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా బన్నీ వెల్లడించాడు. ఈ మేరకు అల్లు అర్హ, అల్లు అయాన్, అల్లు స్నేహాతో కలిసి సిమెంట్ వేస్తున్న ఫోటోను షేర్ చేశారు. ఇక దీంతో బన్నీ కొత్త కాపురం పెట్టేశాడని కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











