అల్లు అర్జున్‌పై ఇంత పిచ్చి ప్రేమనా? అభిమాని ఎంత రిస్క్ చేశాడో తెలుసా? (వీడియో)

సినీ తారలను పిచ్చిగా అభిమానించే వారు ఉండటం ఎంతో మందిని చూసి ఉంటాం. ఒక్కొక్కరు తాము ఆరాధించే హీరో, హీరోయిన్‌పై రకరకాలుగా తమ ప్రేమను చాటుకొంటారు. గతంలో రక్తంతో ఉత్తరాలు రాసిన వారిని, అలాగే చేతులు, దేహంపై పచ్చ బొట్టు వేసుకొనే వారిని.. అలాగే మొకాళ్ల మీద మొక్కులు తీర్చుకొనే వాళ్లను.. అలాగే కాలినడకన దేవుళ్లను, హీరోలను దర్శించుకొనే వారిని కోకొల్లలుగా చూశాం. కానీ అల్లు అర్జున్‌నే అభిమానంతో ముంచెత్తిన అభిమాని కథ కొత్తగా ఉంది. ఆ ఫ్యాన్స్ ఏం చేశారనే విషయంలోకి వెళితే..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఐకాన్ స్టార్‌గా మారి నటించిన పుష్ప చిత్రంతో ఆ ఫ్యాన్ బేస్‌ను భారీగా పెంచుకొన్నారు. పుష్ప తర్వాత తగ్గేదేలే అంటూ తన అభిమానాన్ని, ప్రేమను చాటుకొంటున్నాడు. ఉత్తరాదికి చెందిన అభిమాని అల్లు అర్జున్‌ను కలిసేందుకు భారీ సాహసమే చేశారు.

Allu Arjun Diehard Fan Travelled from Aligarh to Hyderabad on Cycle for 1600km to Meet Pushpa 2 star

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలిగఢ్ నుంచి అల్లు అర్జున్‌ను చూడాలనే కోరికతో బయలు దేరాడు. తన సైకిల్‌పై పలు రాష్ట్రాలు, నగరాలు దాటి సుమారుగా 1600 కిలోమీటర్లు ప్రయాణించి ఎట్టకేలకు తన హీరోను చేరుకొన్నాడు. తన అభిమాని గురించి తెలుసుకొన్న అల్లు అర్జున్ స్వయంగా తన ఇంటిలోకి ఆహ్వానించి ఆలింగనం చేసుకొన్నాడు. తనపై ఉన్న అభిమానాన్ని చూసి ఒకింత ఆశ్చర్యపోయారు.. అలాగే ఆవేదన చెందారు.

తన అభిమాని గురించి కుశల ప్రశ్నలు వేశారు. ఊరు, పేరు తెలుసుకొన్నారు. తన కాళ్లపై పడబోయిన అభిమానిని వారించి గుండెలకు హత్తుకొన్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు? అంటే అలిగఢ్ నుంచి అని చెప్పాడు. దాంతో ఎలా వచ్చావు అంటే.. సైకిల్‌పై వచ్చాను అని చెప్పాడు. దాంతో స్టైలిష్ స్టార్ షాక్ గురయ్యాడు.

వెంటనే తన సిబ్బందిని పిలిచి.. నా అభిమాని జాగ్రత్తగా ఇంటికి పంపించే ఏర్పాట్లు చూడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సైకిల్‌పై వెళ్లకుండా చూడండి. ఆయన సైకిల్‌ను బస్‌లో గానీ. లేదా ట్రైన్ టికెట్ వేసి పంపించండి. ట్రైన్ టికెట్ వేసి.. చేతికి కొన్ని డబ్బులు ఇవ్వండి. సైకిల్, గియికల్ తొక్కదు అంటూ అభిమానిని సున్నితంగా మందలించాడు.

అయితే తాను ఆలిగఢ్ నుంచి బయలు దేరేముందు హనుమాన్ మందిరానికి వెళ్లాను. ఏడు సార్లు హనుమాన్ చాలీసా చదివి నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను అని తన అనుభవాన్ని పంచుకోగా.. పుష్ప 2 ప్రమోషన్స్ కోసం ఉత్తర ప్రదేశ్‌కు వస్తే.. నేను కలుస్తాను అని అల్లు అర్జున్ చెప్పగానే.. అభిమాని సంతోషంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2 hyderabad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X