మరో హిట్టు సినిమాకు సీక్వెల్ సిద్ధం చేస్తున్న అల్లు అర్జున్.. ఆర్య2 దెబ్బ మర్చిపోలేదా?

లాక్ డౌన్ లో మన స్టార్ హీరోలు ఫ్యూచర్ కోసం చాలా గట్టిగా ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. మళ్ళీ ఇలాంటి ఖాళీ సమయం దొరుకుతుందో లేదో అని వీలైనన్ని మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. అవసరం అయితే కొత్త తరహా ఆలోచనలను దర్శకులకు చెప్పి కథను డెవలప్ చేయించుకుంటున్నారు. ఇటీవల అల్లు అర్జున్ కూడా ఒక హిట్టు సినిమాకు సీక్వెల్ సిద్ధం చేయమని దర్శకుడికి రచయితకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆర్య 2 దెబ్బ..

ఆర్య 2 దెబ్బ..

సీక్వెల్స్ అనేవి చాలా వరకు హీరోలకు ఒక ప్రధాన ఆయుధం లాంటివి. కాస్త హార్డ్ వర్క్ చేసి సేఫ్ జోన్ లో సీక్వెల్స్ తో హిట్టు కొట్టవచ్చని అనుకుంటారు. కానీ కొందరికి అలాంటి అడుగులు చేదు అనుభవాలను మిగిల్చాయి. అందులో ఆర్య సీక్వెల్ ఒకటి. కొత్త తరహా కథతో మెప్పించాలని ఆర్య బ్రాండ్ ని వాడుకున్న బన్నీకి పెద్ద దెబ్బె పడింది. ఆ సినిమా బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్.

ఇప్పుడు మరో సినిమాకు..

ఇప్పుడు మరో సినిమాకు..

ఇక ఆర్య2 సక్సెస్ కాకపోయినప్పటికి అల్లు అర్జున్ అలాంటి బ్యాడ్ సెంటిమెంట్స్ ని పెద్దగా పట్టించుకోవడం లేదు. మరో హిట్టు సినిమాకు సీక్వెల్ సిద్ధం చేయమని ఇటీవల రైటర్ కి అలాగే ఒక దర్శకుడికి సలహా ఇచ్చాడట. ఆ హిట్టు సీక్వెల్ మరేదో కాదు. 2014లో వచ్చిన రేసుగుర్రం సినిమాకు కొనసాగింపుగా కథను రెడీ చేయాలని ఆలోచిస్తున్నారట.

బన్నీ బెస్ట్ హిట్..

బన్నీ బెస్ట్ హిట్..

అల్లు అర్జున్ కెరీర్ కి మొదటిసారి బిగ్గెస్ట్ క్రేజ్ ని అందించిన సినిమా రేసుగుర్రం. ఆ సినిమాతో బన్నీ కూడా 100కోట్ల మార్కెట్ ని అందుకునే రేంజ్ ఉందని రుజువయ్యింది. అందుకే మరోసారి ఫుల్ యాక్షన్ అండ్ కామెడి ఎంటర్టైనర్ కథలో నటించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. రేసుగుర్రం సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా వక్కంతం వంశీ కథను అందించాడు.

Recommended Video

Anjali Devi Biography || Anjali Devi Movies
ఆర్డర్ వేసిన బన్నీ..

ఆర్డర్ వేసిన బన్నీ..

ఫైనల్ గా రేసుగుర్రం 2 సినిమాకు సీక్వెక్ సిద్ధం చేయమని బన్నీ వక్కంతం వంశీకి చెప్పాడట. అలాగే దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఆ సినిమా కోసం సిద్ధం కావాలని బన్నీ ఆర్డర్ వెసినట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X