మరో రికార్డును అందుకున్న అల్లు అర్జున్ 'డీజే' మూవీ
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న అల్లు అర్జున్ ఇటీవల ఐకాన్ స్టార్ అనే కొత్త ట్యాగ్ ను సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ హీరో స్థాయి రోజురోజుకు మరింతగా పెరుగుతోంది. మొదటి సినిమా నుంచి కూడా విభిన్నమైన కథలతో ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్న బన్నీ దువ్వడ జగన్నాథమ్ సినిమాతో ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు.
డీజే సినిమాలో కేవలం స్టైలిష్ గానే కాకుండా క్లాస్ గా కనిపించి అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాడు. అసలు విషయంలోకి వస్తే ఆ సినిమా మరొక న్యూ రికార్డును అందుకోవడం విశేషం. ఇప్పటికే యూ ట్యూబ్ లో డీజే హిందీ డబ్బింగ్ వెర్షన్ 300మిలియన్ల వ్యూవ్స్ అందుకోగా ఇప్పుడు తెలుగులో 100 మిలియన్ల వ్యూవ్స్ ను అందుకుంది.

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే. ఇక పూజా హెగ్డే కెరీర్ కూడా ఈ సినిమాతోనే ఒక్కసారిగా మారిపోయింది. డీజే సినిమాను నార్త్ జనాలు ఎక్కువగా లైక్ చేశారు. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై కూడా నార్త్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఆ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ పై రోజుకో రూమర్ వినిపిస్తోంది. ఇక సినిమాను ఆగస్ట్ 13న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఆ తేదికి సినిమా రాకపోవచ్చని కూడా టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











