twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ గొప్ప మనసు.. భారీ విరాళం ప్రకటించిన బన్నీ.. కేరళ ప్రభుత్వానికీ ఆర్థిక సాయం

    |

    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త ఆలస్యంగా స్పందించినా..బాగా ఆలోచించి ముందడుగు వేశాడు. అందరూ రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే ఆర్థిక సాయాన్ని ప్రకటించగా.. అల్లు అర్జున్ కేరళ ప్రభుత్వానికి సైతం అండగా నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి హీరోలు కేంద్ర ప్రభుత్వానికి భారీ విరాళాన్ని ప్రకటించి శభాష్ అనిపించుకున్నారు. తాజాగా అల్లు అర్జున్, సుకుమార్, తమన్ వంటి వారు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

    Recommended Video

    Allu Arjun donates Rs 1.25 Cr to AP, TS and Kerala
    నితిన్ మొదలు పెట్టిన కార్యక్రమం..

    నితిన్ మొదలు పెట్టిన కార్యక్రమం..

    కరోనాతో పోరాడేందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు పది లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇక ఈ బాటలో సినీ తారలంతా కదిలి వచ్చారు.

     పవన్, ప్రభాస్ భారీ విరాళం..

    పవన్, ప్రభాస్ భారీ విరాళం..

    పవన్ కళ్యాణ్ కేంద్రానికి కోటి, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కోటి మొత్తం రెండు కోట్ల విరాళాన్ని ప్రకటించాడు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కేంద్రానికి మూడు కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి ప్రకటించాడు. ఇప్పటి వరకు ప్రభాస్ ఇచ్చిందే అతి పెద్ద మొత్తం.

    తాజాగా అల్లు అర్జున్..

    తాజాగా అల్లు అర్జున్..

    తాజాగా అల్లు అర్జున్ స్పందిస్తూ.. కరోనాను ఎదుర్కొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు, కేరళ ప్రభుత్వానికి కలిసి రూ. 1.25కోట్ల విరాళాన్ని ప్రకటిస్తున్నట్టు తెలిపాడు. అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఇంట్లోనే ఉండాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించాడు.

    సుకుమార్, తమన్..

    సుకుమార్, తమన్..

    డైరెక్టర్ సుకుమార్ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు పది లక్షలు, తమన్ ఐదు లక్షల విరాళాన్ని ప్రకటించాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత చినబాబు రెండు తెలుగు రాష్ట్రాలకు పది లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించాడు.

    English summary
    Allu Arjun Donates to Two Telugu States And Also For kerala. Allu Arjun Donates 1.25 Crores To Two Telugu States And Also For kerala Governments toFight WithCorona Virsu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X