బుట్టబొమ్మ వీడియో సాంగ్.. అది ఎప్పటికీ సరిపోదు.. బన్నీ ఎమోషనల్ ట్వీట్
రెండు తెలుగు రాష్ట్రాల్లో అల వైకుంఠపురములో సృష్టించిన బీభత్సం అంతా ఒకెత్తు అయితే.. అందులోని పాటల ప్రభంజనం మరో ఎత్తు. ఒక్కో పాట ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. సామజవరగమనతో మొదలైన వేట.. సిత్తరాల సిరపడుతో ముగిసింది. ఆ రికార్డుల ప్రవాహం ఇప్పటికే ఆగడం లేదు. ఇక కేవలం లిరికల్ వీడియోలే వందల మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంటే వీడియో సాంగ్స్ పరిస్థితి ఏంటో ఓసారి ఊహించుకోవచ్చు.

వరుసగా వీడియో సాంగ్స్..
ఇప్పటికే సామజవరగమన, ఓ మై గాడ్ డ్యాడీ వీడియో సాంగ్స్ రిలీజై ట్రెండింగ్‌లోకి వచ్చాయి. తాజాగా బుట్టబొమ్మ వీడియో సాంగ్ కూడా విడుదలైంది. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన క్షణం నుంచీ ట్రెండ్ అవడం మొదలు పెట్టింది. అదే మరి బుట్టబొమ్మకు ఉన్న ప్రత్యేకత. బుట్టబొమ్మ పాటకు బన్నీ వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో ఎంతగా పాపులర్ అయ్యాయో అందరికీ తెలసిందే.

టిక్ టాక్‌లో ఫుల్ ఫేమస్..
బుట్టబొమ్మ పాటకు టిక్ టాక్‌లో దాదాపు 800 మిలియన్ల వ్యూస్ వచ్చినట్టు తెలుస్తోంది. బన్నీ వేసిన స్టెప్పులను ఎంతో మంది కాపీ కొట్టి అందులో అప్‌లోడ్ చేస్తున్నారు. అందులో కొన్ని బన్నీ కంట కూడా పడ్డాయి. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. బుట్టబొమ్మ వీడియో సాంగ్ విడుదలైన సందర్భంగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

అది ఎప్పటికీ సరిపోదు..
‘మొత్తానికి బుట్టబొమ్మ వీడియో సాంగ్ వచ్చేసింది.. బుట్టబొమ్మపై కొన్ని మిలియన్ల వీడియోలు చేసిన వారందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను.. నాకు ఎంతో సంతోషంగా ఉంది.. ఆ వీడియోల్లోంచి నేను ఓ 400-500 వీడియోలు చూశాను.. అది ఎప్పటికీ సరిపోదు.. మీకెప్పటికీ రుణపడే ఉంటాన'ని ట్వీట్ చేశాడు.
Recommended Video

బన్నీని కదిలించిన వీడియో..
బుట్టబొమ్మ పాటకు టిక్ టాక్‌లో శిల్పా శెట్టి లాంటి స్టార్ హీరోయిన్ కూడా స్టెప్పులేసింది. కానీ బన్నీని ఆ వీడియో కదిలించలేకపోయింది. ఓ ఇద్దరు దివ్యాంగులు చేసిన స్టెప్పులు మాత్రం హార్ట్‌ను టచ్ చేశాయని ట్వీట్ చేశాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు బుట్టబొమ్మ క్రేజ్ ఏపాటిదో.


Click it and Unblock the Notifications











