పదిహేడేళ్ల అల్లు అర్జున్ ప్రయాణం.. నా ఆర్మీ, ప్రేక్షకులకు అంటూ బన్నీ ఎమోషనల్ ట్వీట్

మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. అల్లు హీరోగా నిలదొక్కుకున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరుచుకుని మెగా నీడనుంచి బయటకు వచ్చాడు. మెగా అనే పదానికి దూరంగా, స్టార్ హీరోకు దగ్గరగా తన స్థాయిని పెంచుకున్నాడు. అందుకే ఈ మధ్యన మెగా ఫ్యామిలీ అనే టాపిక్ టచ్ చేయకుండా.. అల్లు ఫ్యామిలీ అంటూ స్పీచులిచ్చేస్తున్నాడు. హీరోగా నేటికి అల్లు అర్జున్‌కు పదిహేడేళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.

గంగోత్రితో పరిచయం..

గంగోత్రితో పరిచయం..


అశ్వనీదత్, అల్లు అరవింద్, కే రాఘవేంద్ర రావు సంయుక్తంగా నిర్మించిన గంగోత్రి చిత్రంతో అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యాడు. గంగోత్రి మ్యూజికల్ హిట్‌గా నిలవడం, వంద రోజుల ఆడటంతో అల్లు అర్జున్ బాగానే క్లిక్ అయ్యాడు. అయితే లుక్స్ పరంగా నెగెటివ్ కామెంట్స్ రావడంతో..పూర్తిగా బాడీ లాంగ్వేజ్‌ను మార్చేసి ఆర్య సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు.

ఎన్నో ఒడిదుడుకులు..

ఎన్నో ఒడిదుడుకులు..


అల్లు అర్జున్ తన కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా ఒక్క ఇండస్ట్రీ హిట్ ఇవ్వలేకపోయానని బాధ పడేవాడంట. ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీ హిట్ కొట్టడానికి పదిహేడేళ్లు పట్టింది. అల వైకుంఠపురములో చిత్రంతో బన్నీ కోరిక తీరిపోయింది.

బన్నీ ఎమోషనల్ ట్వీట్..

బన్నీ ఎమోషనల్ ట్వీట్..


ఈ పదిహేడేళ్ల ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రేక్షకులు, ఆర్మీకి ధన్యవాదాలు తెలిపాడు. తనను పరిచయం చేసిన అశ్వనీదత్, అల్లు అరవింద్, కే రాఘవేంద్ర రావులకు, గంగోత్రి చిత్ర యూనిట్ మొత్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు.

Recommended Video

Allu Arjun donates Rs 1.25 Cr to AP, TS and Kerala
స్పందిస్తున్న డైరెక్టర్స్..

స్పందిస్తున్న డైరెక్టర్స్..


ఈ మేరకు బన్నీ చేసిన ట్వీట్‌పై ఆయనతో పని చేసిన దర్శకులు స్పందిస్తున్నారు. దేశ ముదురు, ఇద్దరమ్మాయిలతో సినిమాలను తెరకెక్కించిన పూరీ జగన్నాథ్, డీజే సినిమాను తీసిన హరీష్ శంకర్ స్పందించారు. కంగ్రాట్స్ అంటూ ఇంకా ముందుకు వెళ్లాలంటూ కోరుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X