బామ్మ, కూతురుతో బన్నీ.. స్వీయ నిర్భందంలో ఫుల్ ఎంజాయ్
ప్రపంచమంతా కరోనా ధాటికి వణికిపోతోంది. భారతదేశంలో దాదాపు 240 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ప్రజలంతా స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం కోరగా.. సెలెబ్రిటీలంతా తమ తమ ఇంటికే పరిమితమయ్యారు. స్టార్ హీరో అయినా ఎవ్వరైనా సరే ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
సెలెట్రిటీలందరూ ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీ సరదాగా గడిపేస్తున్నారు. మరికొందరు హీరోలు వర్కౌట్లు చేసుకుంటూ.. టైమ్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలా టాలీవుడ్ హీరోలందరూ ఇంటి పట్టునే ఉండటం అరుదైన విషయమే. ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే ఉండటం అతి తక్కువ సమయాల్లో జరుగుతూ ఉంటుంది.

బిజిబిజీగా గడిపే స్టార్ హీరోలందరికి కరోనా పుణ్యమా అంటూ ఇంటి సభ్యులతో సరదాగా గడిపే చాన్స్ వచ్చింది. ఆ కమ్రంలో అల్లు అర్జున్ తన బామ్మ, కూతురు అర్హతో ఆడుకుంటున్నాడు. బామ్మతో సరదాగా ముచ్చట్లు చెబుతున్నట్లుగా, బన్నీకి ఆప్యాయంగా ముద్దు పెట్టిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్వారంటైన్ టైమ్ అంటూ అల్లు స్నేహా తన భర్తకు సంబంధించిన పిక్స్‌ను పోస్ట్ చేసింది.



Click it and Unblock the Notifications











