సంధ్య 70MM తొక్కిసలాట .. విషాదాన్ని కూడా వదలరా? అల్లు అర్జున్‌పై పెరుగుతున్న నెగిటివిటి
మాములుగా ఓ పెద్ద సినిమా వస్తుంది అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ హంగామా ఏ రీతిలో ఉంటుందో ప్రత్యేకంగా పని లేదు. ఇక అది ఓ మాస్ హీరో సినిమా అంటే టికెట్స్ కోసం యుద్ధాలు జరగాల్సిందే. ఒకప్పుడు మన సీనియర్ స్టార్ హీరోస్ సినిమాలకి థియేటర్స్ దగ్గర తొక్కిసలాటలు, లాఠీ దెబ్బలు పడాల్సిందే.. అయితే ఈ పరిస్థితి ఇప్పటికీ ఇలానే కొనసాగుతుంది.
లేటెస్ట్ గానే తెలంగాణ ప్రాంతంలో మాస్ థియేటర్స్ ఏరియా అయినటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య 70MM థియేటర్స్ లో జరిగిన విషాద ఘటన అందరికీ తెలిసిందే. ఐకాన్ స్టార్ ఆలు అర్జున్ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 రిలీజ్ కి వచ్చింది. ఎప్పటిలాగే అక్కడ ఆటోమాటిక్ గా భారీ హంగామా నడిచింది. కానీ పుష్ప ప్రీమియర్స్ చూసేందుకు అభిమానులు పోటెత్తారు.

అక్కడికి సడెన్‌గా హీరో అల్లు అర్జున్ వస్తున్న నేపథ్యంలో ఆయన చూసేందుకు జనం ఎగబడటంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీనితో ఓ నిండు ప్రాణం కోల్పోగా ఓ బాబు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ విషాద ఘటనపై అల్లు అర్జున్ అండ్ చిత్ర యూనిట్ నుంచి ఒక సందేశం వచ్చింది. అయితే అల్లు అర్జున్ ఈ విషాదంపై స్వయంగా ఒక వీడియోని బయటకి వదిలాడు . కానీ ఈ వీడియో పట్ల పెద్ద ఎత్తున విమర్శలు తనపై వస్తున్నాయి.
ఈ వీడియోలో అల్లు అర్జున్ వారికి ఆర్ధికంగా సాయం చేస్తానని.. తనవైపు ఎలాంటి తప్పు లేదు అన్నట్టుగా తెలిపారు. ఈ సంగతి పక్కన పెడితే జరిగిన దారుణానికి బాధిత కుటుంబానికి కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు అంటూ అల్లు అర్జున్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికంటే దారుణమైన విషయం ఏమిటంటే ఇలాంటి సమయంలోనూ అల్లు అర్జున్.. ఆ విషాద ఘటనని తన సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నాడు అంటూ ఆరోపణలు వస్తున్నాయి.
ముఖ్యంగా ఆ వీడియోలో సరిగ్గా చూసినట్టు అయితే తన హూడీకి రెండు గొడ్డళ్ళ మార్క్ కనిపిస్తుంది. ఇవి తన పుష్ప సినిమాలో, పలు పోస్టర్స్‌లోనూ కనిపిస్తాయి. దీనితో ఇలాంటి సమయంలో కూడా అల్లు అర్జున్ తన సినిమా ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు అంటూ ఆయనపై మరిన్ని విమర్శలు వస్తున్నాయి. ఒక్క తెలుగు ఆడియెన్స్ నుంచే కాకుండా తమిళ ఆడియెన్స్ నుంచి కూడా ఈ తరహా కామెంట్స్ తన వీడియోపై రావడం గమనార్హం.
ఇప్పటికే అల్లు అర్జున్‌పై చాలా నెగిటివిటీ పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో ఇలాంటి పనుల మూలాన తనపై అది మరింత పెరుగుతుంది అని విశ్లేషకులు అంటున్నారు. అలాగే ఘటన బుధవారం రాత్రి జరిగితే అల్లు అర్జున్ తీరిగ్గా ఒక రోజు గ్యాప్ తీసుకొని, పుష్ప విజయాన్ని వేడుకగా చేసుకున్నాక ఇపుడు స్పందిస్తున్నాడు అంటూ ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











