అల వైకుంఠపురంపై ఆసక్తి తో అల్లు అర్జున్ ఫాన్స్ ఎదురుచూపులు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి భారీ హిట్ కోసం అభిమానులు కసిగా ఎదురుచూస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతోంది అలా.. వైకుంఠపురములో మూవీ. ఈ సినిమా కోసం ఇద్దరూ ప్రత్యేక శ్రద్ద పెడుతున్నారు. చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్న చిత్రయూనిట్, మరోవైపు ప్రమోషన్స్ కూడా వేగవంతం చేసింది. ఈ మేరకు అప్‌డేట్స్ ఇస్తూ బన్నీ అభిమానులను ఖుషీ చేస్తోంది. స్టైలిష్ స్టార్ నుంచి భారీ హిట్టు కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 12 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











