పవన్ కళ్యాణ్‌కి అంత సీన్ లేదు .. మళ్లీ కెలికిన బన్నీ ఫ్యాన్స్

మాములుగా సినిమా హీరోల అభిమానుల నడుమ బాక్సాఫీస్ దగ్గర పోటీ వంటివి కనిపిస్తూ సినిమాలో ఒకరికి ఒకరు కౌంటర్ లు వేసుకోవడం వంటివి కొనసాగేవి. కానీ తర్వాత వారి అభిమానులు వాటిని ఫ్లెక్స్ లలో కూడా వేసుకుని రెచ్చగొట్టే చర్యలకు దిగేవారు. అయితే ఇపుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ అంతకు మించి హద్దులు దాటుతోందని అంటున్నారు.

దీనితో ఒక కుటుంబంలో ఉన్న హీరోలు నుంచి కూడా ఇపుడు చీలికలు వచ్చి వారి అభిమానులే తన్నుకు చస్తున్నారు. కాగా ఇటీవల 2024 ద్వితీయార్ధంలో మెగా కుటుంబపు హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల నడుమ పెద్ద యుద్ధమే నడుస్తూ వస్తుంది. ఒకే ఒక్క ఇన్సిడెంట్ తో ఓవర్ నైట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగా అభిమానులు అందరికి విలన్ అయ్యిపోయాడు.

allu arjun fans straight question to pawan credit in maharashtra election

సరే ఏదో తన ఫ్రెండ్ కోసమే వెళ్ళాడు అనుకుంటే తర్వాత కూడా అల్లు అర్జున్ చేసిన పలు వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. దీనితో సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు వార్ షురూ అయ్యింది. ముఖ్యంగా అయితే పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నడుమ పెద్ద యుద్ధమే నడుస్తుండగా ఇది సినిమాల పరంగా కాకుండా రాజకీయాలు పరంగా కూడా వెళుతుంది అని చెప్పాలి.

ఇపుడు పవన్ ఇంకా అల్లు అర్జున్ లకి నార్త్ ఆడియెన్స్ లో ఓ రేంజ్ క్రేజ్ కనిపిస్తుంది. రీసెంట్ గానే పవన్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేస్తే అల్లు అర్జున్ పాట్నాలో తన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ చేసుకున్నాడు. రెండూ పెద్ద హిట్ అయ్యాయి. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో వచ్చిన ఫలితాల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ ప్రచారం చేసాడో ఇంట్రెస్టింగ్ గా గతంలో ఎన్నడూ అక్కడ గెలవని చోట కూడా తాను ప్రచారం చేసిన పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.

allu arjun fans straight question to pawan credit in maharashtra election

దీనితో నేషనల్ పాలిటిక్స్ లో కూడా పవన్ సత్తా చాటుతున్నాడు అని పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. పవన్ నేషనల్ లీడర్ అని తన వల్లే అక్కడ వారు గెలిచారు అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అయితే దీనిపై బన్నీ ఫ్యాన్స్ నుంచి ఓ సూటి ప్రశ్న వస్తుంది. పవన్ వల్లే గెలిచేసినంత సీన్ లేదు అని పవన్ కేవలం స్టార్ క్యాంపెయినర్‌గా మాత్రమే వెళ్లారని తెలిపారు.

నిజంగా పవన్ కళ్యాణ్ కి అంత సీనే ఉంటే తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో కూడా వచ్చి ప్రచారం చేశారు కదా అక్కడ ఎందుకు ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయారు అంటూ లాజికల్ ప్రశ్నలతో బన్నీ ఫ్యాన్స్ గాలి తీసేస్తున్నారు. మరి ఇది కూడా ఒకింత నిజమే అని చెప్పాలి. అక్కడ ఫుల్ క్రెడిట్ తీసేసుకుంటున్న పవన్ ఫ్యాన్స్.. తెలంగాణలో ఎందుకు గెలవలేదు అంటే మాత్రం దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. దీనితో ఈ రకంగా కూడా ఇద్దరి హీరోల అభిమానుల నడుమ రచ్చ మామూలుగా కొనసాగడం లేదు.

More from Filmibeat

Read more about: pushpa 2 allu arjun pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X