Pushpa 2 నిర్మాతలపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం.. ఆ సంస్థల ముందు ధర్నా!
తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోల అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేం. అభిమాన హీరోను ఒక్క మాట అన్న తట్టుకోలేరు. అభిమానంతో కొందరు మంచి పనులు చేస్తే.. మరికొందరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి.. అరే ఏంట్రా ఇది అనేలా చేస్తారు.
ఇదిలా ఉంటే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు కోపం కట్టలు తెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే పుష్ప 2 (Pushpa 2) మేకర్స్ పై ఆగ్రహంతో ధర్నా చేసేందుకు రెడీ అయినట్లుగా న్యూస్ తెగ హల్ చల్ చేస్తుంది.

భారీ అంచనాలు: తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి ఇంటర్నేషనల్ స్థాయిలో సత్తా చాటిన చిత్రాల్లో పుష్ప ఒకటి. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందనేది తెలిసిన విషయమే. దీంతో పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎవరెవరు అంటే?: బన్నీ-సుక్కు కాంబోలో నాలుగోసారి వస్తున్న చిత్రం 'పుష్ప: ది రూల్' కోసం నటీనటుల నుంచి టేకింగ్ వరకు సుకుమార్ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరో జగపతి బాబు, బిగ్ బాస్ దివి, ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక పుష్ప 2 సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన టీజర్, ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి.

వివిధ పుకార్లు: ఇక పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ పేరు మారు మోగిపోవడంతో అతని మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. అందుకు తగినట్లుగా పుష్ప 2 విడుదల తేది, ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. అయితే పుష్ప 2 మూవీ షూటింగ్ పూర్తయి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నట్లు టాక్ వచ్చింది. కానీ సినిమా 50 శాతమే షూటింగ్ కంప్లీట్ చేసుకుందని కూడా మరికొన్ని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
నో ఇన్ఫర్మేషన్: పుష్ప వరల్డ్ వైడ్ హిట్ తో పుష్ప 2ను మరింత ఆసక్తిగా తెరకెక్కించేందుకు సుక్కు ట్రై చేస్తున్నట్లు సమాచారం. అయితే బన్నీ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ పుష్ప 2 మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు. ఇతర హీరోలకు చెందిన అప్డేట్లు వస్తున్నా.. పుష్ప టీమ్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో గుస్సా అవుతున్నారు.
హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్: పుష్ప 2 నుంచి టీజర్, ఫస్ట్ లుక్ వచ్చి 3 నెలలు దాటిపోయింది. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. 'పుష్ప టీమ్ మేలుకోవాలి' #WakeUpTeamPushpa అంటూ హ్యాష్ ట్యాగ్ తో వరుస ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో ఇది ట్రెండింగ్ లోకి వచ్చింది. సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలను ట్యాగ్ చేస్తూ ఈ హ్యాష్ ట్యాగ్ పెడుతూ ట్వీట్స్ చేస్తున్నారు.
ధర్నా చేసే అవకాశం: అంతేకాకుండా ఇవాళ అంటే ఆగస్టు 6న అల్లు అర్జున్ అభిమానులు అందరూ మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ వద్దకు భారీగా తరలిరావాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పుష్ప 2 మూవీ అప్డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ధర్నా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











