Pushpa 2 ఆల్ టైమ్ రికార్డ్.. నేషనల్ వైడ్ అల్లు అర్జున్ క్రేజ్.. దుమ్మెత్తిపోస్తున్న ప్రేక్షకులు
గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తర్వాతి కాలంలో వరుస సినిమా హిట్స్ ఇచ్చాడు. తన డ్యాన్స్, యాక్టింగ్ స్టైల్ తో అశేషమైన అభిమానులను సంపాదించుకుని స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు పుష్ప 2తో అలరించనున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైన దీని నుంచి పెద్దగా అప్డేట్స్ రావట్లేదు. కానీ, ఇదివరకు విడుదలైన ఫస్ట్ లుక్ కు బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. అదేంటనే వివరాల్లోకి వెళితే..
అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం పుష్ప 2. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు, సినీ ప్రియులు, బన్నీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇదివరకు రెండు అంటే రెండే పెద్ద అప్డేట్స్ వచ్చాయి. వాటిలో ఒకటి 'పుష్ప: ది రూల్' మూవీ టీజర్. The HUNT before the RULE టైటిల్ తో బయటకు వదిలిన ఈ టీజర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. తిరుపతి జైలు నుంచి 8 బుల్లెట్టు గాయాలతో తప్పించుకున్న పుష్ప కోసం పోలీసులు వెతకటంతో ప్రారంభమైన టీజర్ అదిరిపోయింది.

అంతేకాకుండా పుష్ప 2 టీజర్ లో పుష్ప మద్దతుదారులు నిరసనలు, అల్లర్లు, 144 సెక్షన్, పుష్ప గొప్పతనం గురించి ప్రజలు మీడియాకు చెప్పడం, పోలీసులే పుష్పను ఎన్ కౌంటర్ చేశారని వార్తల్లో రావడం, అడవిలో పుష్ప షర్ట్ రక్తపు మడుగులో దొరకడం, పులుల కోసం ఏర్పాటు చేసిన కెమెరాల్లో పుష్ప కనిపించే సీన్లతో హోరెత్తించారు. ఈ టీజర్ తర్వాత బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. దీంట్లో అల్లు అర్జున్ అమ్మవారి అవతారంతో చేతిలో గన్ పట్టుకునే లుక్ మైండ్ బ్లోయింగ్ లా ఉంది.
అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్ కు బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ పోస్టర్ ఇన్ స్టా గ్రామ్ లో 7 మిలియన్ లైక్స్ సాధించుకుంది. ఇలా ఇండియాలోనే ఏ పోస్టర్ సాధించని ఘనతను పుష్ప 2 ఫస్ట్ లుక్ చేజిక్కుంచుకుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ 'ఆల్ టైమ్ నేషన్ వైడ్ రికార్డ్' అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషన్ వైడ్ రూల్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అయితే ఈ పోస్ట్ పై నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
"ఒరేయ్ అయ్యా పార్ట్ 1 వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు పార్ట్ 2 గురించి ఏం లేదు. సినిమా తీస్తున్నారా, లేదా ప్రాంక్ చేస్తున్నారా" అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. "నీ బతుకు ఒక్క అప్డేట్ ఇవ్వు", "ఏదైనా అప్డేట్ ఇవ్వండి మాస్టారు", 'నిజంగానే స్మగ్లింగ్ చేస్తున్నారా. అప్డేట్ ఇవ్వండి అయ్యా" అంటూ కామెంట్లతో తిట్టిపోస్తున్నారు.


Click it and Unblock the Notifications











