Allu Arjun ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ ఒక్కరోజుకు ముందే పుష్ప 2 సూపర్బ్ గిఫ్ట్!
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు అల్లు అర్జున్. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్ తొలి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు. ఇక పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుని ఐకాన్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న సినిమా పుష్ప 2. అయితే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. ఆ వివరాల్లోకి వెళితే..
గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొంది దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఇందులో అల్లు అర్జున్ నటనకు యావత్ దేశం ఫిదా అయింది. ఆయన స్వాగ్, డ్యాన్స్, డైలాగ్స్ ను రీల్స్ చేసి మరి అనుకరించింది యూత్. ఇప్పుడు పుష్ప 2తో వస్తున్నాడు అల్లు అర్జున్.

పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ తో పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. అందుకే క్యాస్టింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ. 200 కోట్లు కోట్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రూ. 200 కోట్లు ఇచ్చైన సరే పుష్ప 2 ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసుకుందట ప్రముఖ ఓటీటీ దిగ్జం నెట్ ఫ్లిక్స్.
ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ 8న. దానికంటే ఒక్క రోజు ముందు అంటే ఏప్రిల్ 7న ఫ్యాన్స్ కు పుష్ప 2 నుంచి అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నారు. అదేంటంటే 'పుష్ప: ది రూల్' నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ బర్త్ డే రోజున పుష్ప 2కు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసి ఆసక్తి పెంచనున్నారని టాక్. ఇక పుష్పతో పోల్చితే పుష్ప 2లో బన్నీ లుక్ డిఫరెంట్ గా ఉండబోతుందని తెలిసింది.

ఇటీవల అల్లు అర్జున్ లాంగ్ హెయిర్ తో కనిపించిన విషయం తెలిసిందే. అది ఈ సినిమా కోసమే అని టాక్ వస్తోంది. మరి పుష్ప 2లో బన్నీ లుక్ ఎలా ఉండబోతుందనేది ఏప్రిల్ 7 వరకు ఆగాల్సిందే. అయితే దానికంటే ముందుగానే అంటే ఏప్రిల్ 5న ఉదయం 11:07 గంటలకు అప్డేట్ ఇవ్వనున్నట్లు తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. ఒక నరికిన చెట్టుపై రక్తపు మరకలతో ఉన్న గొడ్డలి ఉన్న పోస్టర్ ను విడుదల చేసి ఈ అప్డేట్ గురించి ప్రకటించడం ఆసక్తి కలుగుతోంది. ఇలా ఒక్కో అప్డేట్ ఇస్తూ బన్నీ బర్త్ డేను స్పెషల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుంది పుష్ప 2 టీమ్.


Click it and Unblock the Notifications











