మెగా ఫ్యామిలీని మరిచిన అల్లు అర్జున్.. బాహుబలి, కేజీఎఫ్ అంటూ.. వకీల్ సాబ్ పేరెత్తని ఐకాన్ స్టార్
ఐకార్ స్టార్‌గా మారిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప చిత్రం టీజర్‌ను అంగరంగవైభవంగా ఆవిష్కరించారు. అలాగే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకొని 20 కేజీల బరువు ఉన్న కేక్‌ను అతిథుల మధ్య అల్లు అర్జున్ కట్ చేసి అభిమానులతో తన ఆనందాన్ని పంచుకొన్నారు. ఇంట్రడ్యూసింగ్ పుష్ప ఈవెంట్‌లో అల్లు అర్జున్ మాట్లాడుతూ..

నా పేరుపై మంచి పనులు చేయడం
నా బర్త్ డేను పురస్కరించుకొని అభిమానులు గత 100 రోజలుగా చేస్తున్న మంచి పనులను చూస్తున్నాను. నా అభిమానులు మంచి పనులకు ఉపయోగపడాలి. మంచి పనులు చేయడం, నా పేరు మీద అలా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అది నా గొప్పతనం కాదు. మీ గొప్పతనం అంటూ అల్లు అర్జున్ అన్నారు.
హెబ్బా పటేల్ క్లీమేజ్ షో.. ఎరుపు రంగు బ్రాలో గ్లామర్ షో

తెలుగు సినిమా ప్యాన్ ఇండియా లెవెల్‌లో
తెలుగు సినిమాను ప్యాన్ ఇండియా స్థాయికి చేర్చిన తమిళ, కన్నడ, మలయాళం, ఉత్తరాది ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. మీరు ఆదరించడం వల్లే టాలీవుడ్ చిత్రాలు జాతీయ స్థాయిలో రాణిస్తున్నది. మనమంత ఏకతాటిపై ఉంటే రానున్న 25 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రీగా మారడం ఖాయం అని అల్లు అర్జున్ అన్నారు.

బాహుబలి, కేజీఎఫ్ అంటూ
త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాహుబలి కావొచ్చు, కేజీఎఫ్ కావొచ్చు, ఏ సినిమా అయినా కొవొచ్చు.. ప్యాన్ ఇండియా మూవీకి మీ సపోర్ట్ కావాలి. ప్యాన్ ఇండియా చిత్రంగా పుష్ప రూపొందుతున్నది. దానికి కూడా మీ సపోర్ట్ కూడా కావాలి అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

మెగా ఊసెత్తని స్టైలిష్ స్టార్
అయితే పుష్ప టీజర్ రిలీజ్ కార్యక్రమంలో వేదికపై మాట్లాడుతూ ఒక్కసారి కూడా మెగా ఫ్యాన్స్ గురించి కానీ, మెగా కుటుంబం గురించి ప్రస్తావించకపోవడం సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అల్లు అర్జున్ తీరును చూసి మెగా అభిమానులు కూడా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.

వకీల్ సాబ్ గురించి ప్రస్తావించని ఐకాన్ స్టార్
అలాగే రిలీజైన బాహుబలిని గురించి మాట్లాడారు. అలాగే రిలీజ్ కాబోయే కేజీఎఫ్ గురించి మాట్లాడారు. రెండు రోజుల్లో రిలీజయ్యే వకీల్ సాబ్ గురించి మాట్లాడకపోవడంపై ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. అలాగే ఆచార్య సినిమా గురించి, అంతేకాకుండా దిల్ రాజు, రాంచరణ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా గురించి కూడా ప్రస్తావించకపోవడంపై మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











