ఈడు మగాడ్రా బుజ్జీ.. చెప్పి మరీ బ్లాక్‌బస్టర్ కొట్టాడు.. అల్లు అర్జున్‌కు దిమ్మతిరిగే ప్రశంస

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గ్యాప్ ఇచ్చినా గానీ.. అభిమానులకు దద్దరిల్లే హిట్‌ను అందించారు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురంలో సినిమా రిలీజై మంచి టాక్‌ను సొంతం చేసుకొంటున్నది. ఈ క్రమంలో సినిమా యూనిట్ మంచి జోష్‌తో ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు అల్లు అర్జున్, త్రివిక్రమ్, పూజాహెగ్డేతోపాటు చిత్ర యూనిట్ హాజరైంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ..

ట్విట్టర్‌లో నేను పెట్టిన మెసేజ్

ట్విట్టర్‌లో నేను పెట్టిన మెసేజ్

అల వైకుంఠపురంలో సినిమాతో ఎంటర్‌టైన్ చెయ్యగలిగే అదృష్టం ఇచ్చిన మొత్తం తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఏడాదిన్నర క్రితం జూలై 26న నేను ట్విట్టర్లో పెట్టిన ఒక మెసేజ్.. నాపై ఎనలేని ప్రేమను కురిపిస్తున్న నా ప్రియమైన అభిమానులకు థ్యాంక్స్. నా తదుపరి సినిమా ప్రకటన కోసం సంయమనంతో వేచి చూడండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ సమయం తీసుకొంటుంది. నిజానికి ఓ మంచి సినిమాను ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాను. అందుకే కొంచెం సమయం తీసుకొంటుంది. మీరు నన్ను అర్ధం చేసుకొంటున్నందుకు థ్యాంక్స్ అని అల్లు అర్జున్ అన్నారు.

ఈడు మగాడ్రా బుజ్జీ

ఈడు మగాడ్రా బుజ్జీ

ఇవాళ సినిమా రిలీజైన తర్వాత ఒక వ్యక్తి నాకు పంపిన రిప్లైని భరణిగారు చదువుతారు" అని మైకు భరణికి ఇచ్చారు. భరణి "చెప్పి మరీ బ్లాక్‌బస్టర్ కొట్టాడు.. ఈడు మగాడ్రా బుజ్జీ" అని చదివి మైకు తిరిగి బన్నీకి ఇచ్చారు. బన్నీ కొనసాగిస్తూ "అది నాకు చాలా ఇష్టమైన త్రివిక్రమ్ గారి డైలాగ్. ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులకూ, ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. మీ లవ్ నాకు అందింది. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్‌తో ఇది నా ఫస్ట్ ఫిల్మ్. ఆయనతో కలిసి చాలా సినిమాలు చెయ్యబోతున్నా అని అల్లు అర్జున్ అన్నారు.

మా తాత గురించి మాట్లాడినందుకు

ఉత్తర భారతదేశంలో నేను చేసే ఫైట్లు ఇష్ట పడతారు. నాకొచ్చిన యాక్షన్ ఇమేజ్‌కు కారణం రాం-లక్ష్మణ్ మాస్టర్స్. మా తాతయ్య గురించి బ్రహ్మానందం మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది. సునీల్, నేనూ కలిసి చేసిన బోర్డ్ రూం సీన్‌కి థియేటర్లో వచ్చిన రెస్పాన్స్ అద్భుతం. మా ప్రతి కాంబినేషన్ బ్లాక్‌బస్టర్ అని ఆయన చెప్పిన మాట నిజం. వినోద్ సినిమాటోగ్రఫీ లేకపోతే సినిమాకు ఈ రేంజ్ ఉండేది కాదు అని అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు.

Recommended Video

Ala Vaikunthapurramuloo Genuine Public Talk
మా బావ పబ్‌లో ఉన్నా.. షూట్‌లో ఉన్నా..

మా బావ పబ్‌లో ఉన్నా.. షూట్‌లో ఉన్నా..

తమన్ మ్యూజిక్‌ని చాలా ఇష్టపడే ప్రేక్షకుడ్ని నేను. మా బావ (నవదీప్) బిగ్ బాస్‌లో ఉన్నా, పబ్‌లో ఉన్నా, షూట్‌లో ఉన్నా, సక్సెస్ పార్టీలో ఉన్నా, ఒక్కడే ఉన్నా, ఒకే వైబ్‌లో ఉంటాడు. హర్ష చాలా బాగా తన క్యారెక్టర్ చేశారు. రాజేంద్రప్రసాద్ గారితో వరుసగా మూడో హిట్టు కొట్టినందుకు హ్యాపీగా ఉంది. కథ వినకుండా ఓకే చేసిన సుశాంత్‌కు ఏదో ఒక స్కోర్ ఉండాలనుకున్నా.. క్లైమాక్స్‌లో 'కొడితే ఫీలవుతారంకుల్' అని చెప్పి నడుస్తుంటే అందరూ క్లాప్స్ కొట్టారు. నేనేం కోరుకున్నానో అది అతనికి వచ్చింది అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X