Don't Miss!
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Sports మా భారత క్రికెటర్లకు ఇంకా ఆ గతి పట్టలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మీ సేవలు భేష్.. ఫిలిం జర్నలిస్టుల కోసం అల్లు అర్జున్ భారీ సహాయం..
'అల... వైకుంఠపురంములో' చిత్రంతో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులు (నాన్ బాహుబలి) నెలకొల్పిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను బుధవారం 'ఫిల్మ్ న్యూస్‌క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా' ప్రెసిడెంట్ వి. లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ వై. జె. రాంబాబు, జనరల్ సెక్రటరీ నాయుడు సురేంద్ర కుమార్, జాయింట్ సెక్రటరీ జి. శ్రీనివాస్ కుమార్, ట్రెజరర్ జి. జలపతి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పి. రఘు, వై. రవిచంద్ర, కె. ఫణి, వి. శ్రీనివాస రావు, జి. శ్రీనివాస్ తది కలిశారు. సినిమా భారీ విజయం సాధించిన సందర్భంగా ఆయనను అభినందించారు.
మాటల మధ్యలో జర్నలిస్టుల సంక్షేమానికి 'ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా' చేస్తున్న కార్యక్రమాలను తెలుసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు, ఎంతో మంచి పని చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. వెంటనే తన వంతుగా 10 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు. తాము వచ్చింది అభినందించడానికి మాత్రమేనని, ఆర్థిక సహాయం కోరడానికి కాదని అసోసియేషన్ ప్రతినిధులు అల్లు అర్జున్ గారితో చెప్పగా... "మీరు చేస్తున్న పనులు నాకు బాగా నచ్చాయి. ఇది టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ అమౌంట్ మాత్రమే. ఇకముందు కూడా మీకు సహాయం చేస్తాను" అని ఆయన అన్నారు.
తన పెద్ద మనసును చాటుకున్నారు.ఈ సందర్భంగా అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ... "జర్నలిస్టుల ఆరోగ్య భద్రత, సంక్షేమం, ఇతర కార్యక్రమాల కోసం 'ఫిల్మ్ న్యూస్‌క్యాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా' చేస్తున్న కృషి ప్రశంసనీయం. మంచి పనులు చేస్తున్నారు. ఈ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు నాకు ఎంతగానో నచ్చాయి. అందుకని, నా వంతుగా కొంత సహాయం చేస్తున్నాను. భవిష్యత్తులోనూ అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. జర్నలిస్టులపై నాకెంతో గౌరవం ఉంది అని అన్నారు.
మా సినిమాలను అభిమానులు, ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్ళేది జర్నలిస్టులే. వాళ్ల సంక్షేమంలో నేను భాగం కావడం సంతోషంగా ఉంది. జర్నలిస్టులకు ఏ సహాయం కావలసిన నేను ముందుంటాను. మీరు అందరూ సమిష్టిగా పని చేయాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఒకే తాటిపైకి రావాలి. మీకున్న పవర్ చాలా పెద్దది. ఇండస్ట్రీలో ఎటువంటి డిఫరెన్స్ లేకుండా మీరంతా ఒకటే అని చూపించాలి" అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.