Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
యువ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముఖ్య అతిథిగా స్టైలిష్ స్టార్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో యువహీరో సినిమాకు సపోర్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. గతంలో చిన్న సినిమాలకు చాలా సార్లు తనదైన శైలిలో సపోర్ట్ అందించిన అల్లు అర్జున్ కంటెంట్ నచ్చితే ఎలాంటి సహాయమైనా సరే చేస్తాడు. ఇక పప్రస్తుతం పుష్ప సినిమాతో తీరిక లేకుండా బిజీగా ఉన్నప్పటికీ యువ హీరో కార్తికేయ సినిమాకు సపోర్ట్ చేయడానికి సిద్ధమయ్యాడు.
కార్తికేయ నెక్స్ట్ 'చావు కబురు చల్లగా సినిమాతో' ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మార్చ్ 19న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల ఒక ఫన్నీ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇక ఇప్పుడు మార్చ్ 9న జరగబోయే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ రాబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేశారు.
కార్తికేయ లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. హీరో హీరోయిన్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన టీజర్ సాంగ్స్ ను ఇటీవల రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో అవి వైరల్ గా మారాయి. ఇక అల్లు అర్జున్ రాకతో సినిమా స్థాయి మరో లెవెల్ కు వెళ్లడం కాయం. చూడాలి మరి సినిమా ఏ రేంజ్ లో క్లిక్కవుతుందో..