'చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ కి ఆ బ్లాక్ బస్టర్ లేదు'
ప్రస్తుతం తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ స్టార్ హీరోస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. కాగా అల్లు అర్జున్ తెలుగు సినిమా నుంచి ఇపుడు ఏకంగా పాన్ ఇండియా లెవెల్లోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోగా నిలిచాడు. కాగా అల్లు అర్జున్ విషయంలో సినిమా పరంగా ఎలా ఉన్నప్పటికీ ఆఫ్ లైన్ లో మాత్రం తన చేష్టలు ఒకోసారి హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి.
కాగా అలాగే గత కొంత కాలం నుంచి తాను మెగా బ్రాండ్ కి దూరంగా ఉంటూ తన సొంతం బ్రాండ్ తోనే పాన్ ఇండియా లెవెల్లో మంచి మార్కెట్ ని తెచ్చుకునే దిశగా వెళుతున్నాడు. కాగా ఇలా మెగా వర్సెస్ అల్లు అభిమానులుగా ఇపుడు సోషల్ మీడియాలో కూడా నడుస్తుంది. అయితే ఎంత లేదు కాదు అనుకున్నా కూడా అల్లు అర్జున్ అనే హీరో మూలాలు చూస్తే అందులో ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి అనే పేరు తప్పకండా ఉంటుంది.

అల్లు అర్జున్ కెరీర్ పరంగా చిరంజీవి కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కాగా ఇపుడు అలాంటి విషయాల్లో ఒక ఊహించని ఫ్యాక్ట్ ఒకటి దర్శకుడు సుకుమార్ నుంచి బయటకి వచ్చింది. కాగా అల్లు అర్జున్ కి సుకుమార్ కి ఎలాంటి ట్రాక్ రికార్డు ఉందో అందరికీ తెలిసిందే. అసలు వీరి కాంబినేషన్ మొదలైందే "ఆర్య" అనే బ్లాక్ బస్టర్ నుంచి.
కాగా అసు అల్లు అర్జున్ కి ఈ బ్లాక్ బస్టర్ సినిమా రావడానికి ప్రధాన కారణమే మెగాస్టార్ చిరంజీవి అని ఇపుడు సుకుమార్ చెప్తే కానీ తెలియలేదు. కాగా అల్లు అర్జున్ కి ఆర్య కథ కోసం మొదట చిరంజీవి గారికి చెప్పడం జరిగింది అని అయితే అప్పుడు చిరంజీవి గారు దర్శకునిగా సుకుమార్ తోనే చెయ్యాలని డిసైడ్ చేశారట.

కానీ అల్లు అరవింద్ కి మాత్రం సుకుమార్ కొత్త దర్శకుడు ఎక్కడా అసిస్టెంట్ గా కూడా చెయ్యేదు అని నమ్మని సమయంలో సుకుమార్ కి జస్ట్ కెమెరా ఇచ్చి ఈ సినిమా చేయించినా హిట్ అవుతుంది అని నమ్మి ఆ సినిమాకి తనని పుష్ చేసి దర్శకునిగా అవకాశం ఇప్పించారని తెలిపారు. దీనితో అలా మొదలైన ఆర్య అనే సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది అప్పట్లో.
మరి అప్పుడు చిరంజీవి ప్రోత్సాహం కానీ లేకుండా డెఫినెట్ గా అల్లు అర్జున్ కెరీర్ లో ఆ బ్లాక్ బస్టర్ బహుశా ఉండకపోవ్చని చెప్పడంలో డౌట్ లేదు. మరి ఇలాంటి చిరంజీవి విషయంలో ప్రెజెంట్ జెనరేషన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుండడం గమనార్హం. ఇక ఇవి పక్కన పెడితే ఇదే అల్లు అర్జున్, సుకుమార్ నుంచి వచ్చిన పుష్ప 2 సినిమాలో అదనంగా 20 నిమిషాలు చేర్చి లేటెస్ట్ గా థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఆల్రెడీ 1800 కోట్లకి పైగా వసూళ్లు అందుకున్న ఈ సినిమా ఈ 20 నిమిషాలతో మరింత అందుకుంటుంది అని మకర్స్ అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











