Allu Arjun: ఆపదలో అభిమాని కుటుంబం.. అల్లు అర్జున్ సాయం.. గొప్ప మనసు అంటూ ప్రశంసలు!

ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో హీరోలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గిపోయింది. అయితే అప్పట్లో హీరోలు చేసిన ఏ విషయాలు బయటకు పెద్దగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హీరోలకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ క్షణాల్లో తెలిపోతుంది. ఇక సాయం చేసి బయటకు చెప్పుకోని హీరోలు ఎంతో మంది ఉంటారు. వారిలో ఒకరే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆపద కాలంలో అభిమానిని ఆదుకుని వారికి అండగా నిలుస్తున్నాడు బన్నీ. కష్టాల్లో ఉన్న అభిమానికి సాయం అందించి తన గొప్ప మనసు చాటుకున్నడు ఐకాన్ స్టార్. ఆ వివరాల్లోకి వెళితే..

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన డ్యాన్స్, యాక్టింగ్ తో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో స్టైలిష్ స్టార్ గా, తాజాగా ఐకాన్ స్టార్ గా ముద్ర వేసుకున్నాడు. ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ ఒక్క సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న 'పుష్ప: ది రూల్' సినిమా చేస్తున్నాడు బన్నీ. అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్న అభిమానులకు ఆపద వస్తే వెంటనే స్పందించి ఆదుకునేందుకు ముందు ఉంటాడు అల్లు అర్జున్. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే తాజాగా బన్నీ తన అభిమానికి ఆర్థిక సాయం అందించిన సంఘటన.

అర్జున్ కుమార్ అనే వ్యక్తి అల్లు అర్జున్ కు వీరాభిమని. అతని తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఆ ట్రీట్ మెంట్ చేయించాలంటే రూ. 2 లక్షల దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే అర్జున్ కుమార్ వద్ద అంత డబ్బు లేకపోవడంతో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కలిసి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాతలు సాయం చేయాలని కోరారు. ఈ విషయం గీతా ఆర్ట్స్ కంటెంట్ హెడ్ శరత్ చంద్ర నాయుడు వరకు చేరింది. దీంతో ఆయన వెంటనే ఈ విషయాన్ని అల్లు అర్జున్ కు వివరించారు. వెంటనే రియాక్ట్ అయిన బన్నీ ట్రీట్ మెంట్ కు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోమని.. దాన్ని తాను చెల్లిస్తానని తెలిపారు.

Allu Arjun Helped His Fan Family And Netizens Praised Post Goes Viral

అభిమాన హీరో నుంచి సపోర్ట్ రావడంతో అర్జున్ కుమార్ సంతోషానికి హద్దు లేకుండా పోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. "నాకు సహాయం చేసిన నా హీరో అల్లు అర్జున్ కి థ్యాంక్స్. మీరు చేసిన సాయానికి నా వంతుగా వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. అలాగే శరత్ చంద్ర అన్నగారికి థ్యాంక్స్. గ్రేట్ లీడర్ షిప్. మీరు చేసిన సహాయానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను" అంటూ ట్విటర్ లో అర్జున్ కుమార్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో అభిమాని కుటుంబం ఇబ్బందుల్లో ఉందని తెలియగానే స్పందించి సాయం అందించిన బన్నీని ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X