త్రివిక్రమ్‌ను ప్రేమగా హత్తుకున్న బన్నీ.. సక్సెస్ జోష్‌లో అల వైకుంఠపురములో టీమ్
చాలా గ్యాప్ తరువాత వచ్చిన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌కు అల వైకుంఠపురములో లాంటి సరైన సినిమా పడింది. దాదాపు ఏడాదిన్నర పాటు వెండితెరకు దూరమైన బన్నీ.. ఆ కసి అంతా తీర్చుకున్నట్టు కనిపిస్తోంది. ఆయన తన ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చేందుకు ఇంతలా గ్యాప్ తీసుకున్నాడేమో అనేంతగా అల వైకుంఠపురములో అందర్నీ ఆకట్టుకుంటోంది.

తమన్ సంగీతం ప్లస్..
ఈ చిత్రానికి ముందు నుంచీ ప్రధాన బలమైంది సంగీతమే. ఇది అందరూ నిర్వివాదంగా ఒప్పుకునే అంశం. సామజవరగమన, రాములో రాముల, ఓమైగాడ్ డ్యాడీ లాంటి పాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే అవి సోషల్ మీడియాలో ఎంత ట్రెండీ అయ్యాయో థియేటర్లలోనూ విజువల్‌గా అంతే రేంజ్ ఉన్నాయి. బన్నీ స్టెప్పులు కూడా ఇది వరకెన్నడూ చూడని విధంగా స్టైల్‌గా ఉంటాయి.

త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్..
ఎప్పటి కథనో.. ఇప్పటితరం ప్రేక్షకులకు చెప్పడం ఓ కళ. సినిమా కథ ఏంటి? చివరకు ఏం జరుగుతుందో.. మొదటి సీన్‌లో సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలానే ఉన్నా.. మిగిలిన రెండున్నర గంటలు కూర్చుని చూసేలా చేయడంలో త్రివిక్రమ్ విజయవంతం అయ్యాడు. ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్, టేకింగ్, డైలాగ్స్‌తో ఈ చిత్రాన్ని లాక్కొచ్చాడు.

పాజిటివ్ టాక్..
ఈ చిత్రానికి ఓవర్సీస్‌లోనూ మంచి టాక్ వచ్చింది. ఇక్కడ కూడా ఈ సినిమాకు పాజిటివ్‌గానే వచ్చింది. రివ్యూలు, పబ్లిక్ టాక్, సోషల్ మీడియా టాక్ ఇలా ప్రతీది అల వైకుంఠపురములో చిత్రాన్ని ఆకాశానికెత్తేశాయి. ముందు నుంచి అనుకున్నట్టుగానే ఈ చిత్రం విజయపథంలో నడుస్తుండటంతో నిర్మాతలు ఫుల్ ఖుషీలో ఉన్నట్టు తెలుస్తోంది.

సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో టీమ్..
ఈ సినిమాకు మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో.. చిత్ర నిర్మాతలు సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా నిర్మాత చినబాబు, త్రివిక్రమ్, అల్లు అర్జున్ కేక్ కట్ చేశారు. అనంతరం ఆప్యాయంగా త్రివిక్రమ్‌ను హత్తుకున్నాడు బన్నీ. ఈ సినిమా మంచి విజయం సాధించినందుకు ఈ ఇద్దరు ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











