ఓ విషయంలో చిరంజీవిని గుర్తు చేస్తున్న బన్నీ.. ఆ సీన్స్ అన్నీ అలానే ఉంటాయట
టాలీవుడ్‌లోనే అత్యంత పేరు ప్రతిష్టాలు సంపాదించుకున్న ఇద్దరి కాంబినేషన్ అంటే మామూలు విషయం కాదు. వీళ్లు కలిసి సినిమా చేస్తున్నారంటే దానిపై అంచనాలు భారీగా ఉంటాయి. ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుక్కొంటున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. వీళ్లిద్దరి కాంబినేషన్ ఎంత విజయవంతమైనదో అందరికీ తెలిసిందే. రెండు సూపర్ హిట్‌ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న చిత్రమే 'అల.. వైకుంఠపురములో'. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. తాజాగా దీని గురించి మరో ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏంటా వార్త..? పూర్తి వివరాల్లోకి వెళితే..

త్రివిక్రమ్ అంటే ఇలానే ఉంటుంది
త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు మాటల మాంత్రికుడు అనే బిరుదు ఉన్న విషయం తెలిసిందే. ఆయన సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్లి చూసేదిగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి వరకు ఆయన సినిమాలన్నీ అలానే ఉన్నాయి. ఇప్పుడు వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ‘అల.. వైకుంఠపురములో' కూడా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుందని సమాచారం.

ఒక్కటి కాదు.. అన్నింటికీ అదే రెస్పాన్స్
రెండు బంపర్ హిట్‌ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘అల.. వైకుంఠపురములో'పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలోని పాటలు, గ్లింప్స్‌కు వస్తున్న ఆదరణే దీనికి ఉదాహరణ. ఇటీవల వచ్చిన ‘సామజవరగమన' అంటూ సాగే పాట సౌత్ ఇండియా రికార్డులు క్రియేట్ చేసిన సంగతి విధితమే.

చిన్న దానిలో అన్నీ చూపించారు
‘అల.. వైకుంఠపురములో' టీజర్ బుధవారం సాయంత్రం విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. కేవలం ఒకే జోనర్‌ను చూపించలేదు. మాస్ ఆడియెన్స్‌కు కావాల్సిన ఫైట్స్, డైలాగ్స్.. కుటుంబ ప్రేక్షకులకు కావాల్సిన అంశాలు.. యూత్‌కు కావాల్సిన కలరింగ్‌తో పాటు అన్ని యాంగిల్స్ చూపించారు. దీంతో ఇది వ్యూస్ పరంగా దూసుకుపోతోంది.

ఎన్టీఆర్ సినిమానే మార్చి చేశారు
‘అల.. వైకుంఠపురములో' నందమూరి తారక రామారావు సినిమాకు రీమేక్ అంటూ ఇటీవల ఓ వార్త బయటికొచ్చిన విషయం తెలిసిందే. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో ఎన్టీఆర్, మహానటి సావిత్రి కలిసి నటించిన చిత్రం ‘ఇంటి గుట్టు'. 1958లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీని ఆధారంగానే ఈ సినిమా రూపొందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
Recommended Video

ఆ సీన్స్ మాత్రం చిరు సినిమాలోవే
ఇక, ‘అల.. వైకుంఠపురములో' టీజర్ వచ్చిన తర్వాత ఓ ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆఫీస్‌కు వెళ్తాడట. అప్పుడు చిరంజీవి నటించిన ‘రౌడీ అల్లుడు' సినిమాలోని సీన్స్ గుర్తొచ్చేలా త్రివిక్రమ్ డిజైన్ చేశాడని అంటున్నారు. ఈ సీన్స్ వస్తున్న సమయంలో బన్నీ.. మెగాస్టార్‌ను గుర్తు చేసేలా నటించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











