అల్లు అర్జున్ అల్లరిగా.. లాక్ డౌన్‌లో ప్రతిరోజు ఏం చేస్తున్నాడో తెలుసా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొత్తనికి అల.. వైకుంఠపురములో.. సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసి అభిమానులకు మంచి కిక్కిచ్చాడు. ఇక నెక్స్ట్ కూడా అంతకంటే హై రేంజ్ లో హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇకపోతే లాక్ డౌన్ కారణంగా గత కొన్నిరోజులుగా ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్ డైలీ ఎలా ఉంటున్నారనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ గురించి ఆయన సోదరుడు అల్లు శిరీష్ మాట్లాడాడు.

 బిగ్గెస్ట్ హిట్..

బిగ్గెస్ట్ హిట్..

ఈ ఏడాది సంక్రాంతికి అల..వైకుంఠపురములో.. సినిమాతో బన్నీ అందుకున్న విజయం అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. చాలా గ్యాప్ తీసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన బన్నీ మంచి ఫుల్ మీల్స్ లాంటి సినిమా అందించాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా చాలా ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను బద్దలుకొట్టింది.

బన్నీ ఏం చేస్తున్నాడు..

బన్నీ ఏం చేస్తున్నాడు..

బాక్సాఫీస్ హిట్టు అందుకోగానే బన్నీ కొంత గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే పుష్ప సినిమా స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే లాక్ డౌన్ కారణంగా పనులన్నీ ఆపేయాల్సి వచ్చింది. ఇక అల్లు అర్జున్ బోర్ కొట్టకుండా ఏం చేస్తున్నాడని ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా సందేహాలు మొదలయ్యాయి. అయితే అభిమానుల సందేహాలకు అల్లు శిరీష్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

 అల్లరిగా అల్లు అర్జున్..

అల్లరిగా అల్లు అర్జున్..

అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో ఎలా ఉంటాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. షూటింగ్ కి ఏ మాత్రం గ్యాప్ వచ్చినా తన కుటుంబంతోనే ఏకాంతంగా గడుపుతుంటాడు. ఇక ఇప్పుడు లాక్ డౌన్ వల్ల రోజంతా.. బన్నీ తన పిల్లలోతోనే ఉంటున్నాడట. రోజుకో అల్లరి పని చేస్తూ పిల్లలతో సరదగా టైమ్ స్పెండ్ చేస్తున్నట్లు అల్లు శిరీష్ వివరణ ఇచ్చాడు.

Recommended Video

Allu Arjun Next Movie With Bommarillu Bhaskar After 12 Years
 రోజంతా ఎంజాయ్..

రోజంతా ఎంజాయ్..

చాలా కాలం తరువాత ఎక్కువ గ్యాప్ దొరకడంతో అల్లు అర్జున్ తన పిల్లల్ని ఏ మాత్రం వదలడంలేదట. కూతురు అర్హ, కొడుకు అయాన్ కూడా ఓ మై గాడ్ డాడీ అంటూ.. రోజంతా ఎంజాయ్ చేస్తున్నారట. ఇక ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు అల్లు అర్జున్ సతీమణి స్నేహాలత తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. రీసెంట్ గా అల్లు అర్హ బుట్ట బొమ్మ సాంగ్ ని పాడుతున్నట్లు యాక్ట్ చేయడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X