సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి స్టార్.. అల్లు అర్జున్‌కి అరుదైన గుర్తింపు.. అందాల భామల నడుమ!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి అరుదైన గుర్తింపు లభించింది. ఆయన తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో' సినిమా ద్వారా ఆయన ఈ ఫీట్ సాధించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న అల.. వైకుంఠపురములో ప్రస్తుతం పారిస్ లో సామజవరగమన సాంగ్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూట్ లో అందాల భామలతో అల్లు అర్జున్ అదరగొట్టేస్తున్నాడు. అయితే ఇక్కడో విశేషం ఉంది. ఇంతకీ ఏంటా విశేషం? వివరాల్లోకి పోతే..

 ప్రేక్షకలోకాన్ని మంత్రముగ్ధులను చేసిన సామజవరగమన

ప్రేక్షకలోకాన్ని మంత్రముగ్ధులను చేసిన సామజవరగమన

పారిస్‌లోని అద్భుతమైన, సుందర ప్రదేశాల్లో సామజవరగమన పాట చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఈ లిరికల్ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎస్ఎస్ థమన్ అందించిన మ్యూజిక్, సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం ప్రేక్షక లోకాన్ని మంత్రముగ్ధులను చేసింది.

అల్లు అర్జున్ పక్కన లిడో డాన్సర్స్‌‌

ఇటీవలే పారిస్‌ వెళ్లిన అల.. వైకుంఠపురములో టీమ్.. అల్లు అర్జున్ పక్కన అక్కడి లిడో డాన్సర్స్‌‌తో స్టెప్పులేపిస్తోంది. ఇలా లిడో డాన్సర్స్‌‌తో షూట్ చేసిన ఫస్ట్ సాంగ్ ఇదే అవ్వడం విశేషం. ఈ పాటతో ఫస్ట్ టైమ్ పారిస్‌లో లిడో డాన్సర్స్‌తో డాన్స్ చేసిన సౌత్ఇండియన్ స్టార్‌గా అల్లు అర్జున్‌కి గుర్తింపు లభించింది. గత 25 సంవత్సరాలుగా అక్కడ ఈ లిడో డాన్స్ చాలా ఫేమస్.


ఇప్పటికే విడుదలైన సామజవరగమన సాంగ్‌ లిరికల్ వీడియోనే ఇంకా సంచలనాలు సృష్టిస్తూ వ్యూస్ రాబడుతుంటే.. పారిస్‌లోని అందమైన లొకేషన్లలో లిడో డాన్సర్లు కూడా యాడ్ కావడం సాంగ్‌పై అంచనాలు పెంచేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ చిత్రంలోని సెకండ్ సింగల్ రాములో రాముల కూడా పెద్ద హిట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే.

శరవేగంగా అల.. వైకుంఠపురములో

శరవేగంగా అల.. వైకుంఠపురములో

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'అల.. వైకుంఠపురములో' మూవీలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X