దెయ్యాల వేశాలతో భయపెడుతున్న బన్నీ పిల్లలు.. ఫొటోలను చూస్తే షాకవ్వాల్సిందే
సినిమా ఇండస్ట్రీలో సినీ తారల పిల్లలకు ఈ మధ్య ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే పెరుగుతోంది. వెండితెరపైకి రాకముందే స్టార్స్ రేంజ్ లో క్రేజ్ అందుకుంటున్నారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పిల్లలకు కూడా ఏ రేంజ్ లో క్రేజ్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో నిత్యం వారికి సంబంధించిన ఫొటోలు వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఇటీవల బన్నీ సతీమణి స్నేహ రెడ్డి ఒక స్పెషల్ ఫొటోను షేర్ చేసుకుంది.

స్పెషల్ ఫొటోలతో ఎట్రాక్ట్ చేసే స్నేహ రెడ్డి
అల్లు అర్జున్ కూతురు అర్హ, కుమారుడు అయాన్ దాదాపు బన్నీ రేంజ్ లోనే ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. ఎక్కువగా వారి ఫోటోలను తల్లి స్నేహ రెడ్డి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఎలాంటి పండగలు ఉన్నా లేదా శుభకార్యాలు ఉన్నా కూడా అర్హ, ఆయాన్ స్పెషల్ లుక్స్ తో దర్శనమిస్తుంటారు. ముఖ్యంగా అర్హ తన మాటలతోనే ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుంటుంది.

దెయ్యాల వేశాలతో బన్నీ పిల్లలు
ఇక ఇటీవల సరదాగా స్నేహ రెడ్డి వారి పిల్లలకు ఒక మేకప్ వేసింది. సినిమాలకు సంబంధించిన పాత్రల తరహాలో ఉన్నట్లు అర్డంమయ్యింది. వీరితో పాటు మరో అమ్ముయి కూడా 'అన్నబెల్లి' గెటప్ లో కనిపించగా అర్హ 'ద నన్'గా దర్శనమిచ్చింది. చిన్న దెయ్యం నన్ బయపెట్టాలా ఉన్నా కూడా చాలా క్యూట్ గా అనిపిస్తోందని జనాలు పాజిటివ్ గా కామెంట్స్ చేశారు. చూస్తుంటే ఇంట్లో ఎంతగానో హడావుడి చేసినట్లు అర్ధమవుతోంది.

న్యూ ఫొటోస్ వైరల్
బన్నీ పిల్లలు డిఫరెంట్ గా కనిపించడం ఇది కొత్తేమి కాదు. చాలా సార్లు వారికి నచ్చిన సినిమాల క్యారెక్టర్లలో కనిపించారు. ఇక ఇప్పుడు ఈ భయంకర హారర్ సినిమాల యొక్క పాత్రల్లో కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటో మళ్ళీ ఎడిట్ చేస్తూ అభిమానులువ వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

ఆ సినిమాను కూడా స్టార్ట్ చేయనున్న బన్నీ
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ తనకు ఇష్టమైన డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను ఎనౌన్స్ చేసిన బన్నీ ఆ సినిమా తరువాత వేణు శ్రీరామ్ ఐకాన్ కథను మళ్ళీ పట్టాలెక్కించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











