అల్లు అర్జున్ పొలిటికల్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన స్టార్ దర్శకుడు
స్టైలిష్ అల్లు అర్జున్ గత ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల.. వైకుంఠపురములో 200కోట్ల మార్కెట్ ను అందించడంతో బన్నీ ఇప్పుడు అంతకు మించి అనేలా అడుగులు వేస్తున్నాడు. ఇక పుష్పతో పాటు మరో రెండు నిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అయితే పూర్తిగా తన దృష్టిని పుష్ప సినిమాపైనే పెట్టనున్నాడు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా కోసం అభిమానుకు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.ఇక ఈ సినిమా తరువాత బన్నీ లిస్టులో కొరటాల శివ అలాగే వేణు శ్రీరామ్ ఉన్నారు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయబోయే ఐకాన్ లో డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడట. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సినిమాలో కూడా నెవర్ బిఫోర్ లుక్ తో కనిపిస్తాడని తెలుస్తోంది.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఆ సినిమా విద్యార్ధి యూనియన్ల నాయకుడిగా ఉంటాడని ఇప్పటికే ఒక టాక్ వచ్చింది. అయితే సినిమా రిలీజ్ డేట్ పై కూడా మరొక రూమర్ వినిపిస్తోంది. సినిమా 2022 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చింది. ఇక మార్చ్ 31న రిలీజ్ డేట్ అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











