#AA21 అఫీషియల్: సెట్టయిన కొరటాల, బన్నీ కాంబో.. రిలీజ్ ఎప్పుడంటే?

అనుకున్నదే నిజమైంది. కొరటాల శివ నెక్స్ట్ సినిమా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. అల్లు అర్జున్, కొరటాల కాంబినేషన్ లో ప్రాజెక్టు సెట్టయినట్లు గీత ఆర్ట్స్ అధికారికంగా తెలియజేసింది. అలాగే సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమా కూడా ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవుతున్నట్లు చెప్పారు. అంటే పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కే అవకాశం ఉండవచ్చు. అయితే సినిమా ఎలా ఉండబోతోంది. ఎలాంటి అంశాలతో కొరటాల సందేశాలు ఇవ్వనున్నాడు అని అనేక రకాల సందేహాలు మొదలవుతున్నాయి.

కాంబినేషన్ పై అనేక రకాల రూమర్స్

కాంబినేషన్ పై అనేక రకాల రూమర్స్

గత కొన్ని నెలలుగా ఈ కాంబినేషన్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే కొరటాల శివ, బన్నీ కాంబినేషన్ ఇప్పుడు అనుకున్నది కాదు. మిర్చి సినిమా తరువాత నుంచి ఎన్నోసార్లు ఈ కాంబినేషన్ పై చర్చలు జరిగాయి. ఓ వైపు బన్నీ బిజీగా ఉండడం, మరోవైపు శివ కూడా స్టార్ హీరోలతో బిజీగా ఉండడం వలన సరైన డేట్స్ దొరకలేదు.

 అందుకే ఆలస్యం అయ్యింది

అందుకే ఆలస్యం అయ్యింది

అలాగే స్టైలిష్ స్టార్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కూడా స్టోరీ చేయాలంటే స్క్రిప్ట్ కొన్నాళ్ల పాటు డీప్ గా చర్చలు జరపాలి. అందుకే ఇన్నాళ్లు ఈ కాంబో సెట్టవ్వడానికి ఆలస్యం అయ్యింది. అయితే ఈ లాక్ డౌన్ వల్ల కొరటాలకు బన్నీకి సమయం దొరకడంతో సరైన స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నారు.

రిలీజ్ ఎప్పుడంటే..

రిలీజ్ ఎప్పుడంటే..

ఎలాగైనా సినిమా చేయాలని చర్చలు జరిపి మొత్తానికి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ 2022లో రానున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఎక్చేసింది.

Recommended Video

Megastar Chiranjeevi To Meet CM Jagan To Discuss Tollywood Problems
పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్

పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్

ఇక వీరి కాంబినేషన్ రాబోతున్న సినిమా పూర్తిగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లోనే ఉండబోతోందట. సినిమాలో యువకులు పాలిటిక్స్ లోకి వచ్చి తీరాలి అనే బలమైన సందేశాన్ని తనదైన శైలిలో చూపించబోతున్నారట కొరటాల. లాక్ డౌన్ లోనే దాదాపు స్క్రిప్ట్ పనులు అయిపోయినట్లు తెలుస్తోంది. ఇక బన్నీ సినిమాలో యువ రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నట్లు టాక్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X