Allu Arjun: చిరంజీవిపై బన్నీ ఫన్నీ సెటైర్.. పుష్ప 2లో అసలైందే లీక్ చేశాడుగా!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ రూపకల్పనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రమే 'పుష్ప ది రైజ్'. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంతో ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సమయంలో బన్నీని పాన్ ఇండియా స్టార్‌గా మార్చేసింది. ముఖ్యంగా అతడిని నార్త్ ఆడియెన్స్‌కు దగ్గర చేసింది. ఈ జోష్‌లోనే ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్' మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దీంతో దీనిపై అంచనాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.
మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అవడంతో 'పుష్ప ది రూల్'ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ రెట్టించిన ఉత్సాహంతో జరుపుకుంటోంది. ఇలా ఇప్పటికే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరిపిన షెడ్యూళ్లలో చాలా వరకూ టాకీ పార్టును కూడా పూర్తి చేసుకున్నారు. త్వరలోనే మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేసుకోవాలన్న పట్టుదలతో యూనిట్ సభ్యులు చాలా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలోని ఓ అదిరిపోయే డైలాగ్‌ను అల్లు అర్జున్ లీక్ చేశాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా 'బేబి' మూవీ అప్రిషియేషన్ మీట్‌కు గెస్టుగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ ఈ సినిమా యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. చివర్లో స్పీచ్ ముగిస్తున్న సమయంలో కొందరు అభిమానులు 'పుష్ప 2' డైలాగ్ చెప్పమని అడిగారు. దీంతో బన్నీ 'అమ్మో ఇది చిరు లీక్స్ కంటే డేంజర్‌గా ఉంది. సినిమా పేరు పుష్ప ది రూల్. మూవీలో ఒక్కటే ఉంటుంది. అసలు ఇది చెప్తానని అనుకోలేదు. ఈడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతాండాది. పుష్ప గాడి రూల్' అని అందులోని డైలాగ్‌ను లీక్ చేశాడు.
ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చే 'పుష్ప ద రూల్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. సునీల్, అనసూయ, జగదీష్ కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











