ఖరీదైన మొబైల్ పోగొట్టుకున్న అల్లు అర్జున్.. పుష్ప రాజ్ వేడుకలో చేదు అనుభవం!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ ఇక నుంచి ఐకాన్ స్టార్ గా మారోబోతున్నట్లు దర్శకుడు సుకుమార్ ఫస్ట్ ఈవెంట్ లోనే క్లారిటీ ఇచ్చేశాడు. బిగ్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ బుధవారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక పుష్ప రాజ్ గా బన్నీ నెవర్ బిఫోర్ అనేలా రికార్డులు సృష్టించేలా ఉన్నట్లు చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. అయితే ఈవెంట్ లో బన్నీ తన మొబైల్ ఫోన్ ను పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది.

 పుష్పరాజ్ పరిచయం.. ట్రేండింగ్

పుష్పరాజ్ పరిచయం.. ట్రేండింగ్

ప్రస్తుతం యూట్యూబ్ లో పుష్ప టీజర్ వైరల్ గా మారింది. విడుదలైన నిమిషాల్లోనే టీజర్ భారీ స్థాయిలో వ్యూవ్స్ అందుకుంది. కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూవ్స్ ను క్రాస్ చేసి ప్రస్తుతం 14మిలియన్ల వ్యూవ్స్ తో వెలుతోంది. సుకుమార్ మేకింగ్, అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ టాప్ క్లాస్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈవెంట్ అపశృతి

ఈవెంట్ అపశృతి

అయితే ఈవెంట్ లో కొంత అపశ్రుతి చోటుచేసుకున్నట్లు సమాచారం. ఒక్కసారిగా అల్లు అర్జున్ కోసం అభిమానులు ఎగబడినట్లు తెలుస్తోంది. బాక్సర్లు సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా అభిమానులను కంట్రోల్ చేయలేకపోయారు. కొంత తోపులాట జరిగిందని తెలుస్తోంది.

సరదాగా కలవాలని అనుకుంటే

సరదాగా కలవాలని అనుకుంటే

ఈవెంట్ అనంతరం అల్లు అర్జున్ కు కొంతమంది అభిమానులు కానుకలు గిఫ్ట్ కార్డ్స్ తెచ్చారు. అల్లు అర్జున్ కూడా వారితో సరదాగా కలవాలని అనుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. అయితే బన్నీ వెళ్లిపోయే క్రమంలో ఒక్కసారిగా అభిమానులంతా ఆయనను చుట్టు ముట్టేశారు.

తీసుకునే లోపే ఫోన్ మాయం

తీసుకునే లోపే ఫోన్ మాయం

దీంతో బన్నీ ఎటు పోలేక ఇబ్బందులు పడ్డారు. ఇక కొంతమంది సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నం చేయగా బన్నీ కూడా నవ్వుతూ సెల్ఫీ ఇచ్చాడు. అయితే సడన్ గా జనాల్లో కలిసిపోగా అల్లు అర్జున్ ఫోన్ కిందపడిపోయిందట. తీసుకునే లోపు ఫోన్ మాయమయ్యిందట.

పాన్ ఇండియా సినిమాగా రిలీజ్

పాన్ ఇండియా సినిమాగా రిలీజ్

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతవరకు ఈ విషయంపై అల్లు అర్జుజ్ టీమ్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. అసలు బన్నీ ఫోన్ దొరికిందా లేదా అన్న విషయంపై ఎవరు స్పందించేదు. ఇక సినిమాను ఆగస్ట్ 13న పాన్ ఇండియా ప్రాజెక్ట్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మళయాళం కూడా సినిమాకు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X