సెలబ్రిటీని చేస్తానని మాటిచ్చా.. నీకు మంచి అమ్మాయితో పెళ్లి.. పుష్ప పార్టీలో అల్లు అర్జున్ క్రేజీ స్పీచ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం ప్రపంచవ్యాప్తంగా హిట్ టాక్‌తో దూసుకెళ్తున్నది. విడుదలైన ప్రతీ చోట భారీగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా విజయపథం వైపు పరుగులు పెడుతున్న నేపథ్యంలో పుష్ప యూనిట్ తిరుపతిలో మాస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈసందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ..

పుష్ప సినిమా కోసం చిత్తూరు భాషను రెండు సంవత్సరాలు నేర్చుకొన్నాను. పుష్ప సినిమాలో నేను మాట్లాడిన యాసకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఫంక్షన్‌ను చిత్తూరు జిల్లాలో జరుపాలని అనుకొన్నాను. అందుకే తొలి సెలబ్రేషన్ తిరుపతిలో నిర్వహిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకొన్నారా? ఫైర్.. సుకుమార్ అంటే సుకుమారంగా ఉంటారని అనుకొన్నారా? ఫైర్.. నాకు ఎంత పేరు వచ్చినా.. ఏది వచ్చినా అంతా సుకుమార్‌కే చెందుతుంది అని అల్లు అర్జున్ ఎమోషనల్‌గా మారారు.
ఈ సారి తిరుపతి వెంకన్న సామీ నా వెనుక ఉంటే పెద్దోడిని అయిపోతానని ఏ సమయంలో అన్నారో గానీ.. అది నిజమైంది. నా ఫెర్ఫార్మెన్స్ బాగుందని అంటున్నారంటే.. ఆ క్రెడిట్ సుకుమార్‌దే. శ్రీవల్లి ఫుష్పకే కాదు.. నాకు కూడా నచ్చింది. రష్మిక నటన నన్ను ఆకట్టుకొన్నది. దేవీ శ్రీప్రసాద్ అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఎవరూ ఎదురు చెప్పకుండా పాటలను అందించారు. ఖర్చు వెనుకాడకుండకుండా సినిమాను నిర్మించిన మైత్రీ మూవీస్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా విజయానికి సంబంధించిన క్రెడిట్ నా సహ నటులందరికి ఇస్తాను. కేశవ్; సునీల్, అనసూయ మంచి నటనను ప్రదర్శించారు. అందుకే నేను గొప్పగా నటించాను అని అల్లు అర్జున్ అన్నారు.

చిత్తూరు భాషను నేర్పించిన వారిలో జస్వంత్, ప్రవీణ్, చిట్టేటి మోహన్ తమ వంతు సహకారం అందించారు. చిట్టేటి మోహన్‌ను సెలబ్రిటీని చేస్తానని చెప్పాను అంటూ ఆయనను వేదికపైకి పిలిచాడు. సెలబ్రిటీ అవుతావా అంటూ చిట్టేటి మోహన్‌ను అడిగాడు. అంతేకాకుండా నీకు మంచి అమ్మాయితో పెళ్లి జరుగుతుంది అని అల్లు అర్జున్ అన్నారు. ఇక పుష్ప సినిమాలోని ఇది నా ఫ్యామిలీ బ్రాండ్ డైలాగ్‌ను కొట్టి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు.
అంతేకాకుండా తిరుపతి మాస్ సెలెబ్రేషన్‌ను ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్వహించిన, సహకారం అందించిన పోలీసులు సహకారం అందించారు. వారికి నా ధన్యవాదాలు అంటూ అల్లు అర్జున్ అన్నారు. ఈవెంట్‌ను చక్కగా నడిపించిన యాంకర్ ఉదయభానుని కౌగిలించుకొని థ్యాంక్స్ చెప్పారు.


Click it and Unblock the Notifications











