కాలం వేగంగా పరుగెడుతోంది.. కానీ ప్రేమ మాత్రం: పెళ్లి రోజు సందర్భంగా బన్నీ రియాక్షన్
టాలీవుడ్ క్యూట్ కపుల్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి వివాహ బంధానికి నేటితో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బన్నీ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా తమ పెళ్లినాటి ఫోటోను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన భార్య స్నేహారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు అల్లు అర్జున్.
పెళ్లి ఫొటోను షేర్ చేసిన బన్నీ.. ఆకర్షణీయమైన కోట్ పెట్టారు. 'తొమ్మిదేళ్ల వివాహబంధం. కాలం వేగంగా పరుగెడుతోంది. కానీ ప్రేమ మాత్రం రోజు రోజుకూ రెట్టింపవుతోంది' అంటూ తన భార్య స్నేహారెడ్డిపై ప్రేమ కురిపించారు. దీంతో ఈ పిక్ చూసి మెగా, బన్నీ అభిమానులు పెద్ద ఎత్తున వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అల్లు అర్జున్, స్నేహారెడ్డిలు తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దల అంగీకారంతో 2011లో వారిద్దరూ ఒక్కటయ్యారు. ఈ జంటకు 2014లో అయాన్, 2016లో అర్హ జన్మించారు. ఏ మాత్రం సమయం దొరికినా భార్య, పిల్లలతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు అల్లు అర్జున్.
ఇటీవలే 'అల.. వైకుంఠపురములో' సినిమాతో సక్సెస్ సాధించిన అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తన న్యూ ప్రాజెక్టు చేస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











