Allu Arjun - Trivikram : త్రివిక్రమ్ ను పక్కకి పెట్టిన అల్లు అర్జున్.. కారణం ఇదే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చివరిగా 'పుష్ప2 : దిరూల్'తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. పుష్ప : ది రైజ్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మరోసారి తన సత్తాను చాటింది. కాస్తా మిశ్రమ స్పందనను అందుకున్నప్పటికీ, అనుకొని ఘటన చోటుచేసుకున్నప్పటికీ పుష్ప2 బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. సౌత్ ను మించి నార్త్ లో హంగామా చేసింది. రూ.1870 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసి ఆశ్చర్యపరిచింది. బాహుబలి రికార్డును బ్రేక్ చేసి ఇండియాలోనే సెకండ్ హ్యయేస్ట్ గ్రాసర్ గా రికార్డు క్రియేట్ చేసింది. ఇండియాలో అల్లు అర్జున్ బడా హీరోగా మారిపోయారు. దీంతో ఐకాన్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరి? ఎప్పుడు ప్రారంభం కాబోతోందనే విషయాలపై ఆసక్తి నెలకొంది.

కాగా, అల్లు అర్జున్ లైనప్ లో ఇప్పటికే మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, తమిళ స్టార్ దర్శకుడు అట్లీ, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్స్ ఉన్న సంగతి తెలిసిందే. మరిన్ని టాక్స్ లో ఉన్నాయి. ప్రధానంగా ఈ మూడు ప్రాజెక్ట్స్ లో అల్లు అర్జున్ ఎవరితో ముందు కలిసి వర్క్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే నాలుగోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందని ఫిల్మ్ నగర్ లో గట్టిగా ప్రచారం జరిగింది. ఆ మధ్యన సితార టీమ్ కూడా ఇదే విషయాన్ని కన్ఫమ్ చేసింది.

Allu Arjun moved to another Project from Trivikram Srinivas Here is the Reason

దీంతో ఫోర్త్ టైమ్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో ఎలాంటి ప్రాజెక్ట్ రాబోతుందనేది ఉత్కంఠను నెలకొల్పింది. పుష్ప2 తర్వాత వెంటనే ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు అల్లు అర్జున్ డేట్స్ కూడా ఇచ్చారంట. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నట్టుండి త్రివిక్రమ్ ను సైడ్ కు తోసి.. 'జవాన్' డైరెక్టర్ అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కొద్దిరోజులుగా టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ బన్నీ ఎందుకు సైడ్ చేశాడు... అట్లీ ప్రాజెక్ట్ ను ఎందుకని స్టార్ట్ చేయబోతున్నారనే సందేశాలు ఉత్పన్నమయ్యాయి. దీనికి తాజాగా క్లారిటీ దొరికింది. అసలు కారణం తెలిసింది.

అల్లు అర్జున్ ఇమిడియేట్ గా షూటింగ్ వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారంట.. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీతో తెరకెక్కించాల్సిన ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులను పెండింగ్ లో ఉంచారని, ప్రీ ప్రొడక్షన్ పూర్తి అయ్యేందుకు ఇంకా సమయం పడుతుందని రీసెంట్ గా ప్రొడ్యూసర్ నాగవంశీ తెలియజేశారు. అందుకే అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కాస్తా ఆలస్యం అవుతుందని వివరణ ఇచ్చారు. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కాస్తా సైడ్ కు జరిపి అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్ ను తెరపైకి తెచ్చారంట.

2026 జనవరిలో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కు సంబంధించిన షూటింగ్ రెగ్యూలర్ గా జరుగుతుందని తెలిపారు. ఇక అట్లీ బన్నీతో తన ప్రాజెక్ట్ ను కేవలం 8 నెలల్లో పూర్తి చేసి ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తానని హామీనిచ్చారంట. అల్లు అర్జున్ కూడా త్వరగా నెక్ట్స్ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి ఆడియెన్స్ లోకి ఫ్రెష్ గా రావాలని చూస్తున్నాంట. అందుకే త్రివిక్రమ్ ను పక్కన పెట్టి అట్లీతో బన్నీ నెక్ట్స్ మూవీ ప్రారంభం అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రావాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: allu arjun trivikram srinivas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X