AA19 అఫీషియల్: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ ఖరారు, వివరాలు ఇవే..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఎవరితో చేస్తున్నారు? అనే ఉత్కంఠకు తెరపడింది. గత ఆరు నెలలుగా వివిధ కథలు వింటూ ఎవరితో చేయాలో తేల్చుకోలేక సతమతమైన బన్నీ చివరకు త్రివిక్రమ్ చెప్పిన కథకు ఓకే చెప్పాడు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు.
అల్లు అర్జున్ చివరి సినిమా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' విడుదలై ఆరు నెలలు దాటిపోయింది. తమ అభిమాన స్టార్ సినిమా రావడం ఇంకా లేటవుతుండటంతో టెన్షన్లో ఉన్న ఫ్యాన్స్.... AA19 ప్రకటనతో రిలీఫ్ అయ్యారు.

ముచ్చటగా మూడోసారి
అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూరి లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. దీని తర్వాత వీరు ముచ్చటగా మూడోసారి కలిసి పని చేస్తున్నారు. బన్నీ కోసం మంచి కథను సిద్ధం చేసిన త్రివిక్రమ్ అతడితో హాట్రిక్ కొట్టడం ఖాయం అనే కాన్ఫిడెన్సుతో ఉన్నట్లు తెలుస్తోంది.

అల్లు అరవింద్-ఎస్ రాధాకృష్ణ సంయుక్తంగా
ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ(చినబాబు) సంయుక్తంగా గీతాఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ బేనర్లపై నిర్మించబోతున్నారు. ఇద్దరు పెద్ద నిర్మాతలు కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ భారీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అంచనాలు భారీగా
ఓ వైపు టాలీవుడ్లో టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న త్రివిక్రమ్.... మరో వైపు టాప్ స్టార్లలో ఒకరైన అల్లు అర్జున్ సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో పాటు వీరిది హిట్ కాంబినేషన్ కావడంతో అంచనాలో ఓ రేంజిలో ఉండటం ఖాయం.

త్వరలో పూర్తి వివరాలు
త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ఎలాంటి జోనర్? ఇతర నటీనటులు ఎవరు? ఎప్పుడు ప్రారంభం కాబోతోంది అనే విషయాలు త్వరలో వెల్లడికానున్నాయి.


Click it and Unblock the Notifications











