Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సంక్రాంతి బరిలో నెగ్గిన పుంజు.. బన్నీ షేర్ చేసిన వీడియో వైరల్
నా పేరు సూర్య ఫలితాన్ని చూసిన స్టైలీష్ స్టార్ మళ్లీ మరొక ప్రయోగం చేయడానికి ఇష్టపడలేదు. అందుకే త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. త్రివిక్రమ్ మీద బన్నీ పెట్టుకున్న నమ్మకం అక్షరాల నిజమైంది. కథ పాతదే అయినా.. తెరకెక్కించిన విధానం, ఎక్కడా బోర్ కొట్టించకుండా మాటల మాంత్రికుడి మాయాజాలంతో అల వైకుంఠపురములో చిత్రాన్ని గట్టెక్కించాడు. ఇప్పటికే మూవీ యూనిట్ సెలెబ్రేషన్స్ కూడా మొదలెట్టేసింది.

మొదటి నుంచీ పాజిటివ్ వైబ్స్..
అల వైకుంఠపురములో చిత్రంపై రిలీజ్‌కు ముందే.. పాజిటివ్ వైబ్స్ ఉండటం బాగానే కలిసి వచ్చింది. ఆల్బమ్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించేసింది యూనిట్. సామజవరగమన, రాములో రాముల, ఓమైగాడ్ డాడీ, బుట్టబొమ్మా వంటి పాటలు వినడానికి ఎంత బాగున్నాయో..చూడటానికి కూడా అంతే బాగున్నాయ్. ఇవి కచ్చితంగా అందరికీ ఓ విజువల్ ట్రీట్‌లానే మిగిలిపోతాయి.

త్రివిక్రమ్ మార్క్ టేకింగ్..
ఓ పాత కథను ఇప్పటి ప్రేక్షకులకు నచ్చే విధంగా చెప్పడంలో త్రివిక్రమ్ సిద్దహస్తుడు. అందుకే మీనా నవలను ఈకాలంలో అఆగా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ సినిమాల్లో కథంటూ చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ ఉండకపోయినా.. ఆకట్టుకునే కథనం, ఆలోచింపజేపే మాటలు, గుండెను బరువెక్కించే సీన్స్‌తో అందర్నీ కట్టిపడేస్తాడు. అల వైకుంఠపురములో విషయంలోనూ అదే జరిగింది.
|
మొదటి నుంచి నమ్మకంగా ఉన్న బన్నీ..
ఈ చిత్ర విజయంపై బన్నీ మొదటి నుంచి నమ్మకంగానే ఉన్నాడు. సరదగా ఉండేట్టు ఓ సినిమా చేద్దామని ముందుగానే ఫిక్స్ అయిన త్రివిక్రమ్, బన్నీ అదే విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఎమోషన్‌తో పాటు కామెడీ, మాస్‌కు కావాల్సిన ఎపిసోడ్స్ ఇలా ప్రతీ ఒక్క అంశాన్ని జోడించి అందరికీ కనెక్ట్ అయ్యేలా తీశారు.

సంక్రాంతి సెలెబ్రేషన్స్ స్టార్ట్..
సంక్రాంతి సెలెబ్రేషన్స్ స్టార్ట్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో సినిమాలో క్లైమాక్స్ పాటను కొంత ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. అల వైకుంఠపురములో చిత్రంలోంచి ఇప్పటి వరకు ఆ జానపద పాట క్లైమాక్స్‌లో ఉంటుంది. ఆ పాటను చిత్రీకరించిన విధానం, బన్నీ యాక్షన్ సీక్వెన్స్ ఇలా ప్రతీ ఒక్కటి అదిరిపోయేట్టు ఉంటుంది ఆ సీన్. ప్రస్తుతం బన్నీ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.