Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు అర్జున్ పుష్ప.. RRR తరహాలోనే స్పెషల్ ప్లాన్ రెడీ!
గత సంవత్సరం మార్చ్ లో కేరళ అడవులలో కీలకమైన షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న పుష్ప యూనిట్ వెంటనే మరోక కీలకమైన షెడ్యూల్ ని కూడా ప్లాన్ వేసుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పుడే కరోనా డోస్ పెరగడంతో అందరిలాగే షూటింగ్ ని నిలిపివేయాల్సి వచ్చింది. ఇక మొత్తానికి సెప్టెంబర్ లో స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు RRR లాంటి భారీ బడ్జెట్ సినిమానే షూటింగ్ కి సిద్ధం కావడంతో పుష్ప కూడా మరో అడుగు ముందుకు వేయడానికి సిద్ధమైంది.
రీసెంట్ గా గీత ఆర్ట్స్ లో పుష్ప సినిమా షెడ్యూల్స్ కోసం సుకుమార్ ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించారు. అసలైతే ప్లాన్ ప్రకారం డిసెంబర్ లో స్టార్ట్ చేయాలని అనుకున్నారు. అది కూడా కరోనా తగ్గితేనే మొదలు పెట్టాలని భావించారు. కానీ ఇప్పుడు RRR టీమ్ ఏ మాత్రం బయపడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ స్టార్ట్ చేసింది. వారి దూకుడు చూస్తుంటే షూటింగ్ ముగిసే వరకు తగ్గేలా లేరని అనిపిస్తోంది. అయితే ఫైనల్ గా పుష్ప టీమ్ కూడా అనుకున్న సమయాని కంటే ముందే రంగంలోకి దిగుతోంది.
నవంబర్ మొదట్లోనే షూటింగ్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ నెలలోనే స్టార్ట్ చేయాలనే కసి ఉన్నప్పటికీ కొంతమంది తారల డేట్స్ అడ్జస్ట్ కావడం లేదు. నవంబర్ లో అయితే వీలైనంత వరకు అందుబాటులో ఉంటారని ఆ నెలలోనే ఒక ముఖ్యమైన యాక్షన్ ఎపిసోడ్ ని పూర్తి చేయాలని షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. గతంలో ఎప్పుడు లేని విధంగా బన్నీ మొదటిసారి ఒక పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు సుకుమార్ కూడా అంచనాలకు తగ్గట్లుగా భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది పుష్పను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.