Pushpa 2: ఆ రిసార్టులో పుష్పరాజ్ పార్టీ.. మంగళం శ్రీను కంటే హై రేంజ్‌లోనే!
టాలీవుడ్‌లోని స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా రేంజ్‌కు ఎదుగుతున్నారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది నేషనల్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ తెలుగు చిత్రాలకే పరిమితం అయిన అతడు.. రెండేళ్ల క్రితం వచ్చిన 'పుష్ఫ ది రైజ్' మూవీతో ఒక్కసారిగా వరల్డ్ ఫేమస్ అయ్యాడు. మరీ ముఖ్యంగా ఈ చిత్రం వల్ల అల్లు అర్జున్ ఉత్తరాది వాళ్లకు మరింత చేరువ అయ్యాడు. అందుకే ఈ సినిమా అక్కడ వంద కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.
ఎర్రచందనం బ్యాగ్‌డ్రాప్‌తో సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప ది రైజ్' సూపర్ డూపర్ హిట్ అవడంతో.. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా 'పుష్ప ది రూల్'ను తెరకెక్కిస్తున్నారు. ఈ భాగానికి సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటోంది. ఇలా ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ టాకీ పార్టును కూడా పూర్తి చేసుకున్నారు. త్వరలోనే మిగిలిన భాగాన్ని కూడా పూర్తి చేసుకోవాలన్న పట్టుదలతో యూనిట్ సభ్యులు చాలా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని నుంచి క్రేజీ న్యూస్ లీకైంది.

పుష్పరాజ్ సాధారణ కూలీ నుంచి ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో పెద్ద డాన్‌గా ఎలా రూల్ చేశాడు అన్న పాయింట్‌తో 'పుష్ప ద రూల్' రూపొందుతోంది. ఇందులో ఫస్ట్ పార్ట్ కంటే అన్నీ హై రేంజ్‌లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. పార్ట్ 1లో మంగళం శ్రీను పార్టీలానే.. ఈ మూవీలో పుష్పరాజ్ పార్టీ అని పెట్టారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఓ రిసార్టులో జరుపుతున్నారని తెలుస్తోంది. ఇందులో బన్నీతో పాటు రష్మిక మందన్నా, కొందరు కీలక నటీనటులు భాగం అయ్యారని సమాచారం.
ఇక, ఈ పార్టీ ఎపిసోడ్ మొదటి పార్టులో దానికంటే హై రేంజ్‌లో ఉండేలా డిజైన్ చేశారట. అందులో సమంత 'ఊ అంటావా మావ' అంటూ ఊపేసింది. మరి ఇందులో ఎలాంటి ట్రీట్ ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో వచ్చే చిత్రమే 'పుష్ప ద రూల్'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా చేస్తోండగా.. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











