వరద బాధితులకు అండగా ప్రభాస్, అల్లు అర్జున్.. ఎవరెన్ని కోట్లు ఇచ్చారంటే..?
Allu Arjun-Prabhas Donations:గతవారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. భారీ ఆస్తినష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఏపీలో పలు ప్రాంతాల ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ క్రమంలో వరద బాదితులకు పలువురు తెలుగు చిత్ర పరిశ్రమ అండగా నిలుస్తుంది. తెలుగు రాష్ట్రాలకు సాయం చేయడానికి ముందుకోస్తుంది.
ఈ క్రమంలో వరద బాదితులకు పలువురు టాలీవుడ్ హీరోలు, దర్శక , నిర్మాతలు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి. సహాయం చేయడంలో కూడా తాము స్టార్ మే అని నిరూపించుకుంటున్నారు. ఈక్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అల్లు అర్జున్ తమ మనసు చాటుకున్నారు. సహాయం చేయడంలో కూడా తాము స్టార్ మని అనిపించుకున్నారు. ఇంతకీ డార్లింగ్ ప్రభాస్, బన్నీ ఎన్ని కోట్లు విరాళంగా ఇచ్చారో తెలుసా ?

తాజాగా, రెబల్ స్టార్ ప్రభాస్ కూడా వరద బాధితుల సహాయానికి భారీ విరాళాన్ని ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చెరో రూ. 1 కోటి రూపాయల చోప్పున అందించారు. అలాగే, వరదలకు గురైన ప్రాంతాల్లో ప్రజలకు భోజనాలు,తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఆయన ఈ విరాళం ప్రకటించడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సహాయం చేయడంలో కూడా ఆయన బహుబలే అంటు ప్రశంసిస్తున్నారు.

వరద బాధితులకు అల్లు అర్జున్ అండ..
వరద బాధితులకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అండగా నిలిచారు. బాధితులకు ఆపన్నహస్తం అందించారు. మరోసారి తన ఉదారతను చూపాడు. వరద బాధితులకు కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు తన వంతు సహాయంగా కోటి రూపాయాల విరాళం అందించారు. వరదల వల్ల త్రీవంగా నష్టం పోవడం తనకు ఎంతో భాదను కలిగిస్తుందని, అందరూ త్వరితగతిన ఈ విపత్తను నుండి బయటపడాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నానని అల్లు అర్జున్ తెలిపారు.
పవన్ కోటి రూపాయాల విరాళం
కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న వరద బాధితులకు ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా అండగా నిలిచారు. వారి కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని వ్యక్తిగతంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు.
టాలీవుడ్ అండ..
అయ్' మూవీ యూనిట్, 'కల్కి' నిర్మాతలు అశ్విని దత్త రూ. 25 లక్షలు, ఎన్టీఆర్ కూడా తన దాత్రుత్వాన్ని చాటుకున్నారు. వరదబాధితుల సహయం కోసం. 1 కోటి అందించారు. టాలీవుడ్ స్టార్ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ నిర్మాతలైన ఎస్ రాధాకృష్ణ (చినబాబు). ఎస్. నాగవంశీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 లక్షల రూపాయలు అండ్ తెలంగాణ రాష్ట్రానికి 25 లక్షలు మొత్తం 50 లక్షలు విరాళం ప్రకటించారు. యంగ్ హీరో సిద్దు జొన్నల గడ్డ తన గొప్ప మనసు చాటుకున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరద సహాయ నిధికి రూ. 15 లక్షల చొప్పున మొత్తం 30 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











