twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వ్యక్తిగతంగా ఎంతో నచ్చింది.. ‘పలాస’పై బన్నీ ప్రశంసలు

    |

    ఉత్తరాంధ్ర నేపథ్యాన్ని ఎంచుకుని సమాజంలోని అసమానతలను ఎక్కుపెట్టి చూపించిన చిత్రం పలాస 1978. ఈ సినిమా కమర్షియల్ పరంగా అంతగా వర్కౌట్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. సినీ ప్రముఖుల మనసులను దోచుకుంది. ప్రివ్యూ చూసిన సినీ పెద్దలెందలో దర్శకుడు కరుణ కుమార్ సాహాసాన్ని మెచ్చుకున్నారు. తాజాగా బన్నీ కూడా పలాస దర్శకుడిపై ప్రశంసలు కురిపించాడు.

    ఏ మంచి చిత్రం వచ్చినా మెచ్చుకోవడం, ప్రశంసించడంలో అల్లు అర్జున్ ముందుంటాడు. చిన్న సినిమాలు హిట్ అయితే చిత్రయూనిట్ ప్రత్యేకంగా అభినందిస్తుంటాడు. మహానటి యూనిట్‌కు సపరేట్‌గా పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాలకు సంబంధించిన ఈవెంట్లకు పిలిస్తే బన్నీ కాదనకుండా వెళ్తాడు. అలాంటి బన్నీ తాజాగా పలాస చిత్రంపై ప్రశంసలఝల్లు కురిపించాడు. ఈ మేరకు ఓ ఫోటో షేర్ చేశాడు బన్నీ.

    Allu Arjun Praises Karuna Kumar And Palasa movie

    అయితే రీసెంట్‌గా చిత్రాన్ని వీక్షించిన అల్లు అర్జున్ చిత్ర యూనిట్‌ను అభినందించాడు. పలాసా 1978 మూవీ బృందానికి అభినందనలు. ఈ చిత్రాన్ని చూసిన‌ మరుసటి రోజు ఉదయం దర్శకుడిని కలిశాను. అంతర్లీనంగా ఓ సందేశాన్ని ఇస్తూనే అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో ఎన్నో అద్భుతమైన సన్నివేశాలున్నాయి. నాకు వ్యక్తిగతంగా ఎంతో నచ్చింది అంటూ దర్శకుడిని అభినందించిన ఫోటోను బన్నీ షేర్ చేశాడు.

    English summary
    Allu Arjun Praises Karuna Kumar And Palasa movie, Congratulations to the entire team of Palasa 1978. Watched it and met the director the very next morning. Wonderful attempt with a great underlying message. It had so many good moments . I personally liked it
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X