అల్లు అర్జున్ మాస్ డైలాగ్.. మళ్లీ కొత్త చర్చ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప :ది రైజ్ చిత్రంతో ఏకంగా నేషనల్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. గతేడాది బెస్ట్ యాక్టర్ కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డ్ ను అందించింది. ఇక తాజాగా పుష్ప 2 : ది రూల్ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా అవార్డ్ ను అందుకున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డ్ ను అందుకున్నారు. బన్నీ అవార్డ్ ను స్వీకరించిన సమయంలో ఆసక్తికరమైన స్పీచ్ ఇచ్చి ఆకట్టుకుంటున్నారు. ఇక చివర్లో మాస్ డైలాగ్ ను కూడా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.
ఘనంగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా మొదటిసారిగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి, ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నండటం విశేషం. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నివేదా థామస్ వంటి ప్రముఖులు తాజాగా అవార్డులను స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని స్టార్ యాంకర్స్ సుమ కనకాల, శ్రీముఖి హోస్ట్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మాస్ డైలాగ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నారు. అలాగే పుష్ప2 చిత్రంలో ఉత్తమ నటనకు గానూ తెలంగాణ ఫిల్మ్ గద్దర్ అవార్డ్ ను స్వీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దిల్ రాజ్ అవార్డ్ ను అందించారు. అవార్డ్ ను అందుకున్న తర్వాత బన్నీ ప్రసంగించారు. గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ ను ఇంత ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉంది.
పుష్ప 2 చిత్రానికి గానూ తనకు ఉత్తమ నటుడిగా అవార్డు అందించడం ఆనందంగా ఉందని, సినిమాకు పని చేసిన డైరెక్టర్ సుకుమార్, ప్రతి ఒక్క టెక్నీషియన్ వల్లనే అవార్డు దక్కిందని చెప్పుకొచ్చారు. ప్రతి ఏడాది గద్దర్ అవార్డ్ ల ఫంక్షన్ ను ఇలా ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మంచి పాలనను అందిస్తోందని కొనియాడారు. ఇక చివర్లో సీఎం రేవంత్ రెడ్డి అనుమతి తీసుకొని పుష్ప 2లోని మాస్ డైలాగ్ 'నా బిడ్డ మీద గీత పడ్డ.. ఒక్కొక్కడిని రప్పా రప్పా నరుకుతా నా కొడుకా' అంటూ చెప్పారు.
చర్చగా మారిన బన్నీ స్పీచ్..
అల్లు అర్జున్ పుష్ఫ2 చిత్రం గ్రాండ్ రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బన్నీకి, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య వార్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పిలిచి అల్లు అర్జున్ కు అవార్డ్ ఇచ్చిన నేపథ్యంతో.. అల్లు అర్జున్ ఆ మాస్ డైలాగ్ చెబుతూ పరోక్షంగా హెచ్చరించేలా మాట్లాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కానీ అల్లు అర్జున్ అవార్డు వచ్చిన ఆనందంలో ఆ సినిమాలోని కీలకమైన డైలాగ్ ను చెప్పారంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











