Pushpa 2 లో కోసం మైత్రి ఆడిషన్స్.. అవకాశం రావాలంటే ఒక కండిషన్!

అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో వచ్చిన పాన్ ఇండియా సినిమా పుష్ప 1 ఏ తరహాలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధించిన విజయంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ పై అంచనాలు కూడా మామూలుగా లేవు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు. ఇక దర్శకుడు కూడా మిగిలిన షూటింగ్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం సెకండ్ పార్ట్ కోసం కొన్ని ఆడిషన్స్ కూడా నిర్వహించాలని అనుకుంటున్నారు.

రీసెంట్ గా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పుష్ప ఆడిషన్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వారికి కూడా అవకాశాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తిరుపతిలో జూలై 3వ తేదీన నుంచి 5వ తేదీ వరకు వరుసగా మూడు రోజులు 'మేక్ మై బేబీ జీనియస్ స్కూల్లో' ప్రత్యేకంగా ఈ ఆడిషన్స్ నిర్వహించడానికి వేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. పుష్ప ది రూల్ సినిమాలో నటించాలని అనుకునేవారు అక్కడికి వచ్చి ఆడిషన్స్ ఇవ్వాలి అని నిర్మాణ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

 allu arjun pushpa 2 movie new talente auditions in tirupati

అయితే ఈ ఆడిషన్స్ లో పాల్గొనేవారు తప్పనిసరిగా చిత్తూరు యాసపై పట్టు ఉండాలి అని కూడా కండిషన్స్ లో పేర్కొన్నారు. దీంతో సినిమాలో అవకాశం కోసం అల్లు అర్జున్ అభిమానులు అలాగే నటనపై ఆసక్తి ఉన్న ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా అక్కడికి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం నిర్మాణం సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వరుసగా మూడో రోజులు ఆడిషన్స్ జరుగుతాయి అని వివరణ ఇచ్చారు. ఇక రెగ్యులర్ షూటింగ్ ను దర్శకుడు సుకుమార్ అక్టోబర్ నెలలోనే మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సినిమాను 2024 లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X