Pushpa 2: పుష్ప టీమ్ సంచలన నిర్ణయం.. రేవతి కుటుంబానికి భారీ మొత్తం అందజేత..
Pushpa 2: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి తెలుగు చిత్ర పరిశ్రమ అండగా నిలుస్తోంది. బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తూ అండగా నిలుస్తోంది. ఈ తరుణంలో పలు సినీ ప్రముఖులు.. రేవతి కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ 'పుష్ప2'మూవీ యూనిట్ అండగా నిలిచింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థికంగా ఆదుకోవడానికి పుష్ప టీం రూ.2 కోట్ల పరిహారం అందజేయనుంది.
తాజాగా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన కుటుంబాన్ని పరామర్శించడానికి బుధవారం ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, పుష్ప 2 నిర్మాత రవిశంకర్ తో కలిసి అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలుడు తండ్రి భాస్కర్ తో మాట్లాడి అతడికి ధైర్యం చెప్పారు. అనంతరం అల్లు అరవింద్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. శ్రీతేజ్ ఆరోగ్యం బాగుందని త్వరగానే కోలుకుంటున్నాడని తెలిపాడు. సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి పుష్ప2 టీమ్ రూ.2 కోట్ల భారీ పరిహారం అందించబోతున్నట్టు తెలిపారు.అందులో అల్లు అర్జున్ రూ. కోటి, సుకుమార్ రూ. 50 లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్ తరఫున రూ.50 లక్షలు అందజేయనున్నట్టు తెలిపార. ఈ మొత్తాన్ని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు రేవతి కుటుంబానికి అందించనున్నారు. ఇప్పటికే మైత్రీ మూవీస్ సంస్థ భారీ మొత్తంలో ఆర్థిక సహాయం చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్బంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ త్వరగా రికవర్ అవుతున్నాడని తెలిపాడు. అలాగే 72 గంటల నుంచి వెంటిలేటర్ లేకుండా ఉన్నాడని తెలిపారు. ఇక గురువారం ఉదయం 10 గంటలకి సినీ ఇండస్ట్రీ పెద్దలతో కలసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో ఇండస్ట్రీలోని సమస్యలగురించి చర్చించబోతామని ముఖ్యమంత్రితో చర్చించబోతామని వెల్లడించాడు.
పుష్ప 2 సినిమా రిలీజ్ డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అభిమాని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ పిల్లవాడ్ని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్స్ విడుదల చేస్తున్నారు.
మరో వైపు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ను ఏ11 ముద్దాయిగా చేర్చారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే డిసెంబర్ 24న మరోసారి చిక్కడపల్లి పోలీసులు మరోసారి బన్నీని విచారణకు పిలిచారు.


Click it and Unblock the Notifications











