Allu Arjun ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్.. హై రేంజ్ ఎలివేషన్‌తో పుష్ప 2 టీజర్
గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొంది దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు త్వరలో రాబోతున్న 'పుష్ప: ది రూల్' (Pushpa 2)పై రోజురోజుకీ ఆసక్తి పెరిగిపోతుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోయే గ్లింప్ వీడియో ప్రోమోను ఇదివరకు Where is Pushpa అంటూ వదిలి హైప్ పెంచారు. తాజాగా ఫుల్ వీడియో వదిలి బన్నీ ఫ్యాన్స్ కు సూపర్బ్ ట్రీట్ ఇచ్చారు.
భారీ మొత్తంలో: పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ తో పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. అందుకే క్యాస్టింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రూ. 200 కోట్లు కోట్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ భారీ మొత్తం అయిన రూ. 200 కోట్లను ఇచ్చి నెట్ ఫ్లిక్స్ సంస్థ పుష్ప 2 డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసుకుందని ఓ ప్రచారం జరుగుతోంది.

అసలు పుష్ప ఎక్కడ: ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు ఏప్రిల్ 8న కాగా దానికంటే ఒక్క రోజు ముందు అంటే ఏప్రిల్ 7న సాయంత్ర 4.05 నిమిషాలకు ఫ్యాన్స్ కు పుష్ప 2 నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇక దీనికంటే ముందుగానే ఈ వీడియో గురించి ఏప్రిల్ 5న ఉదయం 11:07 గంటలకు హింట్ ఇచ్చారు. Where is Pushpa అనే గ్లింప్స్ తో మంచి హైప్ ఇచ్చారు. ఈ వీడియోలో 'తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. అసలు పుష్ప ఎక్కడ' అంటూ న్యూస్ వచ్చినట్లు చూపించి దీనిపై ఆసక్తిని పెంచేశారు.
అల్లర్లు.. 144 సెక్షన్: ఇక ఈ అప్డేట్ కు సంబంధించిన పూర్తి వీడియోను ఏప్రిల్ 7న అంటే ఇవాళ The HUNT before the RULE అనే టైటిల్ తో సోషల్ మీడియాలో వదిలారు. ఈ వీడియోలో తిరుపతి జైలు నుంచి 8 బుల్లెట్టు గాయాలతో తప్పించుకున్న పుష్ప కోసం పోలీసులు వెతకటం, పుష్ప మద్దతుదారులు నిరసనలు, అల్లర్లు చేపట్టడం, 144 సెక్షన్, పుష్ప గొప్పతనం గురించి ప్రజలు చెప్పడం, పోలీసులే పుష్పను ఎన్ కౌంటర్ చేశారని వార్తల్లో రావడం వంటి ఆసక్తికర విషయాలు చూపించారు.

హీరోయిజానికి హై ఎలివేషన్: అడవిలో పుష్ప షర్ట్ రక్తపు మడుగులో దొరకడం, పుష్ప శేషాచలం అడవుల్లో దాక్కొలేదు.. మలేషియా సింగపూర్ వంటి విదేశాల్లో ఉన్నాడంటూ క్యూరియాసిటీ పెంచారు. ఇక ఫైనల్ గా పులుల కోసం ఏర్పాటు చేసిన కెమెరాల్లో పుష్ప కనిపించే సీన్ అదిరిపోయింది. పుష్ప ను చూసి పులి రెండు అడుగులు వెనక్కి వేస్తూ చిత్రీకరించిన సీన్ పుష్ప హీరోయిజానికి హై ఎలివేషన్ లా ఉంది. ఇక "అడవి జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి రెండు అడుగులు వేసిందంటే పుష్ప వచ్చాడని అర్థం" అంటూ చెప్పే డైలాగ్ విజిల్స్ వేయించేలా ఉంది.
కొద్దిగా మార్పులు: ఇక వీడియో ఎండింగ్ లో ఇది పుష్ప గాడి రూల్ అని కుర్చీలో కూర్చుని కాలు తన్ని అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. The HUNT before the RULE పేరుతో వదిలిన ఈ వీడియో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉంది. ఇందులో అల్లు అర్జున్ లుక్ పుష్ప మొదటి పార్టును కంటిన్యూ చేస్తున్నట్లుగానే కొద్దిగా మార్పులు చేసినట్లు అనిపిస్తోంది. ఈ వీడియో బన్నీ పుట్టిన రోజుకు ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్ అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











