Pushpa 2 Teaserతో యూట్యూబ్‌ షేక్.. ఆ భాషలోనే అధికంగా వ్యూస్.. అలాంటి రికార్డ్!

పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ తో పుష్ప 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. దానికి ఉదాహరణే అల్లు అర్జున్ పుట్టిన రోజు (ఏప్రిల్ 8) సందర్భంగా ఏప్రిల్ 7న విడుదల చేసిన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్. మూడు నిమిషాలు ఉన్న టీజర్ లో Where is Pushpa అంటూ అల్లు అర్జున్ కు హై రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు. దీంతో ఈ టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్, లైక్స్ తో దూసుకుపోతున్న పుష్ప 2 టీజర్ ట్రెండింగ్ లో నిలిచింది.

మెయిన్ విలన్ గా: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాంబినేషన్ లో మరోసారి తెరకెక్కుతున్న క్రేజీ మూవీ పుష్ప 2. ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇందులో నటించే నటీనటుల నుంచి టేకింగ్ వరకు సుకుమార్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరో జగపతి బాబును మెయిన్ విలన్ గా చూపించనున్నట్లు సమాచారం. ఇందులో బిగ్ బాస్ దివితోపాటు ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ ఇతర కీలక పాత్రలు కూడా సందడి చేయునున్నట్లు తెలుస్తోంది.

Allu Arjun Pushpa 2 Teaser Trending In Youtube With 64 Million Views

ఫ్యాన్స్ నే కాదు: ఇక ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన 'పుష్ప: ది రూల్' (Pushpa 2) టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఏప్రిల్ 7న విడుదలైన ఈ టీజర్ యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. Where is Pushpa.. The HUNT before the RULE అంటూ రిలీజైన పుష్ప 2 గ్లింప్స్ అల్లు అర్జున్ అభిమానులను మాత్రమే కాకుండా సినీ లవర్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో పుష్పను చూసి పులి రెండు అడుగులు వెనక్కి వేసే సీన్ టీజర్ కు హైలెట్ గా నిలిచింది.

గంటల వ్యవధిలో: 8 బుల్లెట్టు గాయాలతో పుష్ప తప్పించుకోవడం, పోలీసులు వెతకటం, పుష్ప అనుచరులు నిరసనలు, అల్లర్లు, పోలీసులు 144 సెక్షన్, మీడియాలో పుష్ప గురించి గొప్పగా చెప్పడం వంటి సన్నివేశాలతో ఆసక్తికరంగా టీజర్ ను మలిచారు. దీంతో విడుదలైన గంటల వ్యవధిలోనే ఈ టీజర్ మిలియన్ కు పైగా వ్యూస్ రాబట్టి ట్రెండింగ్ లో నిలిచింది.

Allu Arjun Pushpa 2 Teaser Trending In Youtube With 64 Million Views

హిందీలోనే టాప్: ఈ విషయాన్ని తాజాగా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. పుష్ప 2 టీజర్ విడుదలైన అన్ని భాషల్లో కలిపి 64 మిలియిన్ వ్యూస్ తోపాటు 2.48 లైక్స్ తో టాప్ 1 ట్రెండింగ్ లో రన్ అవుతోంది. ఈ టీజర్ ను తెలుగులో 22 మిలియన్స్ వ్యూస్ రాగా హిందీలో ఏకంగా 35 మిలియన్ల రావడం మరో విశేషం. మొత్తానికి బన్నీ టీజర్ తోనే రికార్డుల మోత మోగిస్తున్నాడు.

Allu Arjun Pushpa 2 Teaser Trending In Youtube With 64 Million Views

చీర కట్టుకుని..: ఇదిలా ఉంటే పుష్ప 2 టీజర్ తర్వాత అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను కూడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ చీర కట్టుకుని అమ్మ వారి గెటప్పులో దర్శనం ఇచ్చాడు. చేతిలో గన్ పట్టుకుని తీక్షణంగా చూస్తూ దుష్ట సంహారం కోసమే అన్నట్లుగా ఉంది ఈ పోస్టర్. ఈ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి బీభత్సమైన స్పందన వస్తోంది. ఈ పోస్టర్ సైతం క్షణాల్లో వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X