Pushpa 2 The Rule: పుష్ప 2 టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడు రాబోతుందంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మికా మందన్నా హీరోయిన్ గా రాబోతున్న క్రేజీ మూవీ పుష్ప 2 ది రూల్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్ అప్ డేట్ వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పుష్ప రాజ్ గా ప్రపంచ సినీ ప్రేమికులు అందరినీ అలరించిన అల్లు అర్జున్.. మరోసారి అదే క్యారెక్టర్ లో కనిపించి మెస్మరైజ్ చేసేందుకు రాబోతున్నారు. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ చిత్రం.. కేవలం ఇండియాలోనే కాకుండా అనేక దేశాల్లోనూ కాసుల వర్షం కురిపించింది. అయితే పార్ట్ 2 ను కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసి మరింత సక్సెస్ సాధించాలనే పట్టుదలతో డైరెక్టర్ సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ పుష్ప 2 తెరకెక్కించారు.

Allu Arjun Pushpa 2 The Rule Movie Teaser Release Date Fixed Check Details

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రావు రమేష్ వంటి వాళ్లు కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా... ఈ సినిమాను ఏప్రిల్ 15వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఈ విషయం తెలిసినప్పటి నుంచి అటు బన్నీ, ఇటు సుక్కు ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ పై ఓ కన్నేస్తున్నారు. అలాంటి వారికోసమే అన్నట్లుగా చిత్రబృందం ఓ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ముఖ్యంగా పుష్ప 2 సినిమా టీజర్ విడుదల తేదీకి ముహూర్తం ఫిక్స్ చేసింది. అల్లు అర్జున్ పుట్టిన రోజు నాడే టీజర్ విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది.

Allu Arjun Pushpa 2 The Rule Movie Teaser Release Date Fixed Check Details

పుష్ప 2 ది రూల్ సినిమా టీజర్ ను ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించింది. ముఖ్యంగా కాలికి గజ్జెలు కట్టి నడుస్తున్న ఫొటోను షేర్ చేసి మరీ టీజర్ విడుదల తేదీని చెప్పింది. అయితే అది పుష్ప రాజ్ కాలులాగే కనిపిస్తుంది. ఒక్క పోస్టర్ తోనే గూస్ బంప్స్ తెప్పిస్తున్న మేకర్స్... టీజర్ తో ఏ రేంజ్ లో అంచనాలు పెంచేస్తారో చూడాలి మరి. అయితే చిత్రబృందం ఈ విషయం ప్రకటించిన క్షణాల్లోనే ఈ వార్త వైరల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X