Pushpa 2 Release date బాక్సాఫీస్ విధ్వంసానికి పుష్ప 2 రెడీ.. అల్లు అర్జున్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
స్టైలిష్ స్టార్‌ను ఐకాన్ స్టార్‌గా మార్చిన అల్లు అర్జున్‌కు పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయం సాధించడమే కాకుండా అవార్డులు, రివార్డులు కూడా తెచ్చిపెట్టింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రష్మిక మందన్న నటించిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకొన్నది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను నమోదు చేసింది. అలాంటి సంచలన చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప2 ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఆ రిలీజ్ డేట్, సినిమా వివరాల్లోకి వెళితే..
పుష్ప చిత్రాన్ని మైత్రీ మూవీస్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది. ఈ సినిమాను 150 కోట్లకుపైగా వ్యయంతో తెరకెక్కించారు. ఈ సినిమా పార్ట్ 1 మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్లు చేసింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 3000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా లాంగ్ రన్‌లో 350 కోట్ల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది.

ఫుష్ప చిత్రం అల్లు అర్జున్ కెరీర్ గ్రాఫ్‌నే మార్చి వేసింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారడమే కాకుండా జాతీయ ఉత్తమ నటుడి అవార్డును తెచ్చిపెట్టింది. తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు ఎవరికి రాని ఉత్తమ నటుడి అవార్డును సాధించిన తొలి హీరోగా అల్లు అర్జున్ రికార్డుకెక్కాడు.
పుష్ప సినిమా సాధించిన విజయాలతో రెండో పార్ట్ ఫుష్ప ది రూల్ సినిమాకు కోసం భారీగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా షూటింగ్ పూర్తి చేసుకోలేకపోవడంతో కాస్తా వాయిదా పడుతూ వచ్చింది. దాంతో ఈ సినిమాను 2024 ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయాలని మైత్రీ మూవీ మేకర్స్ నిర్ణయించింది. ఈ సినిమా రిలీజ్‌ను అధికారికంగా ప్రకటించింది.

మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ డే పోస్టర్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. చేతికి వజ్రాలు పొదిగిన ఉంగరాలు, వాటి చుట్టూ రక్తం మరకలు ఉన్న చేతిని పోస్టర్‌లో హైలెట్ చేశారు. పుష్ప 2 తో అల్లు అర్జున్ ఎలాంటి విధ్వంసం సృష్టించనున్నారనే సంకేతాన్ని నిర్మాతలు చెప్పకనే చెప్పారు.


Click it and Unblock the Notifications











