Pushpa 2: పుష్ప 2 ట్రైలర్లో అరగుండు, మెడలో చెప్పుల దండ.. ఆ నటుడు ఎవరో తెలుసా..?
సెన్సెషనల్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో కాంబో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పుష్ప -2. ఈ మోస్ట్ అవైటెండ్ మూవీ డిసెంబర్ 5న భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ తరుణంలో పుష్ప 2 పై మరింత హైప్స్ క్రియేట్ చేయడానికి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. పుష్ప రాజ్ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇందులోని ప్రతి సీన్ గురించి నెట్టింట చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో ట్రైలర్ లో కనిపించిన అరగుండుతో కనిపిస్తున్న నటుడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇంతకీ ఆ నటుడు ఎవరాని నెట్టిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ అరగుండు నటుడు ఎవరంటే..?
ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2' లో అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించారు. ఇందులో మాలీవుడ్ స్టార్ ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, డాలీ ధనుంజయ, అజయ్ తదితరులు తదితరులు మెయిన్ రోల్స్ లో కనిపించనున్నారు. అయితే.. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా.. డీఎస్పీతో పాటు తమన్ బ్యాక్ రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న వర్డల్ వైడ్ గా విడుదల కాబోతున్నది. ఇప్పటికే మూవీ కి సంబంధించిన పోస్టర్స్, గ్లింబ్స్, లీక్స్ మూవీ పై భారీ హైప్స్ ను క్రియేట్ చేస్తాయి .

ఈ భారీ బడ్జెట్ మూవీపై మరింత హైప్స్ క్రియేట్ అయ్యేలా..శనివారం నవంబర్ 17 న బీహార్ లోని పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు దాదాపు 2 లక్షలాది బన్నీ ఫ్యాన్స్ విచ్చేశారు. ఆశేష అభిమానుల మధ్య పుష్ప 2 ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కు యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్ విడుదలైన గంటలోనే మిలియన్ వ్యూస్ అందుకుని.. సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. ఇలా ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో పుష్ప రాజ్ పై మరింత అంచనాలు పెరిగాయి.
ఇందులో అల్లు అర్జున్ యాక్టింగ్ హైలెట్ గా నిలిచింది. బన్నీ యాక్షన్ పర్ఫామెన్స్ తో పాటు డైలాగ్ డిలెవరీ కూడా అదుర్స్.. నిజంగా బన్నీ ఫ్యాన్స్ పునకాలతో ఊగిపోయారు అనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే .. పుష్ప ట్రెలర్ లో అర గుండు తో ఓ వ్యక్తి కనిపించారు. కనిపించిన 2 సెకండ్లే అయినా.. ఆ వ్యక్తి ట్రైలర్ కే హైలెట్ గా నిలిచారు. దీంతో ఆ అరగుండు నటుడు ఎవరంటూ నెటిజన్స్ తెగ వెతుకుతున్నారు.

ఆ అరగుండు నటుడు ఎవరో కాదు.. తారక్ పొన్నప్ప (Tarak Ponnappa ).. అతడు కన్నడ నటుడు. ఈ ట్రైలర్ లో అరగుండు, మెడలో చెప్పుల దండతో డిఫరెంట్ లూక్ లో కనిపించారు తారక్ పొన్నప్ప. ఆయన కన్నడలో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన యష్ కేజిఎఫ్ లో నటించారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాలో కూడా నటించారు.
తాజా పుష్ప 2 లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ట్రైలర్ లో ఆయన సంబంధించిన షాట్స్ నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. తాను చేసిన ఇతర సినిమాల కంటే.. పుష్ప సినిమాతో ఆయన ఓవర్ నైట్ స్టార్ గా మారారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తారక్ పొన్నప్ప మాట్లాడుతూ.. తాను పుష్ప 2 మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్నననీ, ఆ పాత్ర మూవీనే టర్న్ చేస్తుందనీ, తెలిపారు. ఇంతకీ ట్విస్ట్ ఏంటో .. ఆయన క్యారెక్టర్ గురించి మాత్రం తెలియరాలేదు. ఏది ఏమైనా ప్రస్తుతం తారక్ పొన్నప్ప పుష్ప 2 లుక్ ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చ్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











